Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెక్స్ట్ పోప్ నేనే: చాదస్తం- ఎవరో గుర్తు పట్టారా?

Donald Trump: కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ ఈ నెల 7వ తేదీన ఆరంభం కానుంది. దివంగత పోప్ ఫ్రాన్సిస్ కోసం ప్రార్థించే నోవెండియల్స్ మాస్ ముగిసిన లిసా జెంగారిని డెవిన్ వాట్కిన్స్ దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 267వ పోప్‌ను ఎన్నుకోవడానికి 7వ తేదీన సమావేశమౌతారు.

వాటికన్‌ సిటీలో 5వ జనరల్ కాంగ్రిగేషన్ కోసం సోమవారం ఉదయం హాజరైన సుమారు 180 మంది కార్డినల్స్ ఈ తేదీని ఖరారు చేశారు. ఈ సమావేశం వాటికన్‌లోని సిస్టీన్ చాపెల్‌లో జరుగుతుంది. ఆ రోజున సందర్శకుల కోసం దీన్ని మూసివేస్తారు. ఈ కాంక్లేవ్‌కు ముందు , కార్డినల్ ఎలక్టర్లు ప్రో ఎలిజెండో పోంటిఫైస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

US President Donald Trump posts AI-generated photo of him self as Pope

88 సంవత్సరాల పోప్ ఫ్రాన్సిస్.. ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడిన ఆయన కొద్దిరోజుల కిందట ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. వాటికన్ సిటీకి చేరుకున్నారు. క్రిస్మస్ పండగలోనూ పాల్గొన్నారు. ఈస్టర్ సండే నాడు ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కూడా.

ఈస్టర్ సండే కార్యక్రమానికి హాజరైన 35,000 మందికి పైగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బసిలికా బాల్కనీ నుండి ప్రసంగించారు. స్వేచ్ఛ, సహనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో జీసస్ చూపించిన శాంతిమార్గాన్ని అనుసరించాలని కోరారు. ఆ మరుసటి రోజే ఆయన కన్నుమూశారు.

కిందటి నెల 26వ తేదీన శనివారం ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వివిధ దేశాధిపతులు, ప్రధానమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోప్ ఫ్రాన్సిస్‌కు తుది వీడ్కోలు పలికారు.

కొత్త పోప్ ఎంపిక ప్రారంభం కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్.. తన పైత్యాన్ని ప్రదర్శించారు. పోప్ దుస్తుల్లో ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశారు. నేను పోప్ కావాలనుకుంటున్నాను.. అనే క్యాప్షన్ దానికి జత చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఫొటో అది.

ఈ ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. పోప్ మరణాన్ని ట్రంప్ అవమానిస్తున్నారని విమర్శిస్తోన్నారు సోషల్ మీడియా యూజర్లు. ఇది చర్చిని, దేవుడిని అవమానించడమే. ట్రంప్ క్రీస్తు విరోధి అంటూ ఆరోపిస్తోన్నారు. అత్యంత అసహ్యకరమైన, అవమానకరమైన చర్యగా అభివర్ణిస్తోన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్కులను డొనాల్డ్ ట్రంప్ కించపరిచారని నిప్పులు చెరుగుతున్నారు. కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి కార్డినల్స్ చేపట్టిన ప్రక్రియను సైతం ఆయన తప్పు పట్టారంటూ నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు. గతంలో పోప్ ఫ్రాన్సిస్ తరువాత ఆయన వారసుడిగా ఎవరు కావాలని కోరుకుంటోన్నారంటూ విలేకరులు అడిగినప్పుడు కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారాయన.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+