40 ఏళ్ల నాటి నిషేధం ఎత్తివేత.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెబనాన్‌కు సంబంధించి ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 1985 నుంచి నిలిచిపోయిన రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులపై ఉన్న 40 ఏళ్ల నాటి నిషేధాన్ని ఆయన అధికారికంగా ఎత్తివేశారు. ఈ కీలక నిర్ణయాన్ని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవూన్ స్వాగతించారు. సివిల్ ఏవియేషన్ భద్రత విషయంలో లెబనాన్ చేపట్టిన చర్యలపై అమెరికాకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.

భద్రత విషయంలో నో కాంప్రమైజ్.. ఎలన్ మస్క్ తొందరపాటుకు భారత్ చెక్!
భద్రత విషయంలో నో కాంప్రమైజ్.. ఎలన్ మస్క్ తొందరపాటుకు భారత్ చెక్!

1985లో 'TWA ఫ్లైట్ 847' విమానం హైజాక్ కు గురైన తర్వాత నాటి రోనాల్డ్ రీగన్ ప్రభుత్వం ఈ ప్రత్యక్ష విమాన సర్వీసులపై నిషేధం విధించింది. ఇటీవల జులైలో లెబనాన్ అధ్యక్షుడు అవూన్ వాషింగ్టన్‌లో పర్యటించిన సమయంలో అమెరికా విమానయాన సంస్థలు మళ్లీ నేరుగా విమానాలను నడిపేందుకు అనుమతిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధాల్లో ఇరాన్ మద్ధతు ఉన్న హిజ్బుల్లా బలహీనపడటం, దాని ముఖ్య నేతలు హతమవ్వడం వంటి పరిణామాల మధ్య ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

US President Donald Trump Takes Major Decision US Lifts 40-Year Lebanon Flight Ban Full Details Here

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, మిసైళ్లతో రియాద్ విమానాశ్రయంపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మూడు విమానాలు తీవ్రంగా దెబ్బతినగా.. ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. పలువురు పౌరులు గాయపడ్డారు. ఈ దాడుల కారణంగా విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.

నాకు నోబెల్ కావాల్సిందే.. మారాం చేస్తున్న ట్రంప్!
నాకు నోబెల్ కావాల్సిందే.. మారాం చేస్తున్న ట్రంప్!

ఇదే సమయంలో ఆఫ్రికా దేశమైన సూడాన్ లో దారుణం చోటుచేసుకుంది. బ్లూ నైల్ ప్రావిన్స్‌లోని అబు శంది ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో చిన్నారులతో సహా కనీసం 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీతో పోరాడుతున్న పారామిలిటరీ బలగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+