పర్యావరణానికి పాతర: ఇదీ ట్రంప్ నూతన ఇంధన పాలసీ.. మెక్సికో గోడపై ఎదురుగాలేనా?

వాతావరణ మార్పులు, భూతాపంతో సతమతమవుతున్న భూగోళంపై పర్యావరణ పరిరక్షణకు గతంలో అమెరికా అంతర్జాతీయ వేదికలపై ఇచ్చిన హామీలకు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరమ గీతం పాడారు.

వాషింగ్టన్: వాతావరణ మార్పులు, భూతాపంతో సతమతమవుతున్న భూగోళంపై పర్యావరణ పరిరక్షణకు గతంలో అమెరికా అంతర్జాతీయ వేదికలపై ఇచ్చిన హామీలకు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరమ గీతం పాడారు. సరికొత్తగా ఇది నూతన శకానికి ఆరంభం అని సెలవిచ్చారు.

తద్వారా గత అధ్యక్షుడు ఒబామా కృషిని నిరర్థకంగా చేసేశారు. పర్యావరణ పరిరక్షణలో అమెరికా నాయకత్వ స్థానాన్ని నీరుగార్చారు. స్వదేశీ ఇంధన ఉత్పత్తికి అడ్డంకులు సృష్టిస్తున్న నియమ నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలను సమీక్షించాలని ఆయా విభాగాలను ఆదేశిస్తూ ట్రంప్ అధ్యక్ష ఆదేశాలు జారీచేశారు.

బొగ్గు గనుల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభానికి ట్రంప్ ఆర్డర్

బొగ్గు గనుల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభానికి ట్రంప్ ఆర్డర్

పర్యావరణానికి ప్రతికూలమని భావించి మూసేసిన బొగ్గుగనుల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభించాలన్నదే ట్రంప్ ఆదేశాల సారాంశం. ఇందుకోసం జరిగిన సమావేశానికి పలువురు బొగ్గు గనుల యజమానులు హాజరయ్యారు. తన విధానాలతో అమెరికా ఇంధన, ఉపాధి రంగాల్లో విప్లవం వస్తుందన్నారు. ‘మన ఉద్యోగాలు మనకు వస్తాయి.. మన కలలు నిజమవుతాయి.. అమెరికా మళ్లీ సంపదల దేశం అవుతుంది అన్నారు. స్వచ్ఛ ఇంధన విధానం అమెరికా పరిశ్రమలకు గుదిబండ' అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ ఏకపక్ష వైఖరిపై నిరసన

ట్రంప్ ఏకపక్ష వైఖరిపై నిరసన

భూతాపం, కాలుష్యం తగ్గింపునకు అమలు చేస్తున్న నియంత్రణలను గాలికొదిలి దశాబ్దాల కృషితో సాధించిన పర్యావరణ విజయాలను ట్రంప్ ఏకపక్షంగా మంటగలుపుతున్నారని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గొరె సహా పర్యావరణ వేత్తలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను అమెరికా గతంలో మూసేసింది. అందుకోసం నూతన బొగ్గు గనుల లీజులపై 14 నెలల క్రితం విధించిన మారటోరియాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎత్తివేశారు. బొగ్గు గనులతో అమెరికన్లకు భారీ ఉపాధి అవకాశాలు వస్తాయని, ఇది చారిత్రక నిర్ణయం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

న్యాయ పోరాటానికి పర్యావరణ వేత్తలు సిద్ధం

న్యాయ పోరాటానికి పర్యావరణ వేత్తలు సిద్ధం

బొగ్గు గనుల లీజులు పున: ప్రారంభం, తిరిగి బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకోనుండటం వంటి చర్యలపైనా పర్యావరణ వేత్తలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. అమెరికాయే ప్రథమం అంటే ప్రపంచంలో కార్బన్ కాలుష్యం తగ్గించడంలో నాయకత్వం అందించడం తప్ప ఉపాధి కల్పన పేరిట అసలుకే ఎసరు తేవడం కాదని భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా హెచ్చరించారు. పరిశుభ్ర గాలి/నీరు, కాలుష్యరహిత ఇంధనం వంటివి ట్రంప్‌కు, రిపబ్లికన్‌లకు గిట్టవని, దీనివల్ల అమెరికా చిన్నారుల ఆరోగ్యానికి, ఆర్థికవృద్ధికి ముప్పు ఏర్పడుతున్నదని డెమొక్రాటిక్ నేత నాన్సీ పెలోసీ అన్నారు. ట్రంప్ తాజా ఫర్మానాకు వ్యతిరేకంగా వందల మంది వైట్‌హౌస్ ముందు నిరసన తెలిపారు.

మెక్సికో రక్షణగోడపై రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత

మెక్సికో రక్షణగోడపై రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలే సంకేతాలు నిపిస్తున్నాయి. ఇప్పటికే ఒబామాకేర్‌పై వెనక్కు తగ్గిన ట్రంప్‌పై మెక్సికో సరిహద్దులో రక్షణ గోడ విషయంలోనూ అన్ని వర్గాల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నది. రక్షణగోడ నిర్మాణానికి ఈ ఏడాది 1.5 బిలియన్ డాలర్లు కేటాయించాలన్న ప్రతిపాదన సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ గోడ నిర్మాణాన్ని డెమొక్రాట్లతోపాటు కొందరు రిపబ్లికన్లు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. గోడ వ్యయాన్ని స్పెండింగ్ బిల్లుతో కలిపి కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

వచ్చేనెల 28 లోగా స్పెండింగ్ బిల్లుకు ఆమోదం తప్పనిసరి

వచ్చేనెల 28 లోగా స్పెండింగ్ బిల్లుకు ఆమోదం తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్వహణకయ్యే వ్యయాన్ని స్పెండింగ్ బిల్లు రూపంలో ప్రవేశపెడుతారు.
వచ్చేనెల 28వ తేదీలోగా ఈ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందాలి. ఈ ఆలోచనను కొందరు రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాట్లు సైతం స్పెండింగ్ బిల్లులో రక్షణ గోడ వ్యయాన్ని కలిపితే ఏప్రిల్ 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బిల్లును నిషేధిస్తామని హెచ్చరిస్తున్నారు.

డెమొక్రాట్లు అడ్డుకుంటే ఆరు నెలలు అమెరికా ప్రభుత్వ సంస్థల మూత

డెమొక్రాట్లు అడ్డుకుంటే ఆరు నెలలు అమెరికా ప్రభుత్వ సంస్థల మూత

ఇదే జరిగితే దాదాపు ఆరునెలలపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూతపడే అవకాశం ఉన్నది. రిపబ్లికన్ సెనేటర్ రాయ్ బ్లంట్ మీడియాతో మాట్లాడుతూ రక్షణగోడకు ఇవ్వాలనుకున్న సహాయాన్ని స్పెండింగ్‌బిల్లుతో కలిపి ప్రవేశపెట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 28లోగా బిల్లు పాస్ కావాల్సి ఉన్నందున రక్షణగోడ వ్యయాన్ని మినహాయిస్తే అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+