పాకిస్తాన్ పీఎం ఈజ్ ఎ గ్రేట్ లీడర్: ట్రంప్ పైత్యం: గంట వెయిటింగ్
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. వైట్ హౌస్ లో అడుగు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యారు. ట్రంప్ ఇచ్చే విందులో పాల్గొన్నారు. పాక్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ సమయంలో ఆయన వెంట ఉన్నారు. ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. భారత్- అమెరికా మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్.. పాకిస్తాన్ పీఎంకు విందు ఇవ్వబోతోండటం చర్చనీయాంశమైంది.
ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడానికి షెహబాజ్ షరీఫ్ అమెరికా వెళ్లారు. సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దీని తర్వాత ఆయన స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంది. అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందిందాయనకు. దీంతో న్యూయార్క్ నుండి నేరుగా వాషింగ్టన్ చేరుకున్నారు. వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక సమావేశాలకు పాల్గొన్నారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఇటీవల కుదిరిన అమెరికా-పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. ఈ భేటీకి ముందు- షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌లను స్వయంగా స్వాగతించారు ట్రంప్. వారిని గ్రేట్ లీడర్లుగా అబివర్ణించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఓవల్ ఆఫీస్ ట్రంప్ తో భేటీ కావడానికి వైట్ హౌస్ లో దాదాపుగా గంట పాటు షెహబాజ్ షరీఫ్ ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనతో మాట్లాడటానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు గానీ పెద్దగా రెస్పాండ్ కాలేదాయన. కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన తర్వాత.. తన ఛాంబర్ నుంచి బయటికొచ్చారు ట్రంప్.
మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్, షరీఫ్‌లు కలుసుకున్న తర్వాత ఈ భేటీ ఏర్పాటైంది.అరబ్ దేశాల అధ్యక్షులతో పాటు ఈజిప్ట్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, తుర్కియే ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేకించి షెహబాజ్ షరీఫ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించారు. చివరిసారిగా వైట్ హౌస్‌ను సందర్శించిన పాకిస్తాన్ ప్రధాని.. ఇమ్రాన్ ఖాన్. ఆయన 2019 జూలైలో డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఆయనకు ముందు 2015లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వైట్ హౌస్‌ను సందర్శించారు.
రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగుపర్చుకుంటోన్న విషయం తెలిసిందే. గతంలో ఆ దేశ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ నూ వైట్ హౌస్ కు ఆహ్వానించారు ట్రంప్. ఆయనకు విందు ఇచ్చారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు తాజాగా షెహబాజ్ షరీఫ్ తోనూ భేటీ కాబోతోన్నారు. ఆసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనడానికి అమెరికా సుదీర్ఘకాలం పాటు భారత్‌పై ఆధారపడుతూ వచ్చింది.. ఇప్పుడది రివర్స్ అయింది.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications