డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన అవకాశం
Donald Trump: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సమాయాత్తమౌతోన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేస్తారు.
మొన్నటి ఎన్నికల్లో 312 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 49.9 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,72,68,289గా లెక్క తేలింది. ఈ ఎన్నికలను ట్రంప్ ఏకపక్షంగా మార్చివేశారు తన ఛరిష్మాతో.

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 48.4. మొత్తంగా 7,49,82,822 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టం కట్టిన కొన్ని కీలక రాష్ట్రాలు ఈ దఫా స్వింగ్ అయ్యాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపాయి.
ఈ స్థాయిలో ఘన విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్‌ను పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపిక చేసింది ప్రతిష్ఠాత్మక టైమ్ మేగజైన్. ఈ అరుదైన గుర్తింపును పొందడం ఆయనకు ఇది రెండోసారి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అప్పుడు కూడా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
ఈ ఏడాది ఈ అవార్డ్ కోసం 10 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్‌తో పాటు కమలా హ్యారిస్, కేట్ మిడిల్టన్, ఎలాన్ మస్క్, బెంజమినె నెతన్యాహు, మార్క్ జుకర్‌బర్గ్, యులియా నవాల్నాయా, జెరోమ్ పావెల్, జో రొగాన్, క్లాడియా షెన్‌బామ్ పేర్లను తుది పరిశీలనకు తీసుకుంది. వారిలో ట్రంప్‌ను ఎంపిక చేసింది.
గత ఏడాది అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. ఈ ఘనతను సాధించారు. 2020లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఎంపిక చేసింది టైమ్ మేగజైన్. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం ప్రారంభం అయ్యే న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ఓపెనింగ్ బెల్‌ను సైతం ట్రంప్ మోగించనున్నారు.












Click it and Unblock the Notifications