100 రోజుల్లోనే కరోనాకు బ్రేక్: బిడెన్ యాక్షన్ ప్లాన్‌ ఇదీ: ప్రమాణ స్వీకారం నాటి నుంచే అమలు

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. ప్రాణాంతక కరోనా వైరస్‌పై తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. కరోనా వైరస్‌ను ఎలా నిర్మూలించాలనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా తాను ప్రమాణం స్వీకారం చేసిన రోజే యాక్షన్ ప్లాన్‌ను ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రతి అమెరికన్ కూడా మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేస్తానని అన్నారు. వంద రోజుల పాటు మాస్కులను ధరించగలిగితే.. కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందని పేర్కొన్నారు.

Recommended Video

    COVID-19 Vaccine : 1,600 Million చొప్పున టీకా మోతాదును అత్యధికంగా కొనుగోలు చేసిన దేశంగా India

    మాస్కులను ధరించడం దేశభక్తితో సమానం..

    మాస్కులను ధరించడం దేశభక్తితో సమానం..

    సీఎన్ఎన్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి 20వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అదే రోజు నుంచి వంద రోజుల మాస్కుల ధారణను తప్పనిసరి చేస్తానని జో బిడెన్ స్పష్టం చేశారు. మాస్కులను ధరించడం దేశభక్తితో సమానమని అన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులను ధరిస్తారని చెప్పారు. జీవితకాలం పాటు మాస్కులను ధరించాలని తాను చెప్పట్లేదని, వంద రోజులు చాలని వివరించారు.

    ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ..

    ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ..

    మాస్కులను ధరించడాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తప్పనసరి చేయలేదు. ఫలితంగా- అక్కడ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయనే వార్తలు ఉన్నాయి. వంద రోజుల పాటు ప్రతి అమెరికన్ కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించడం వల్ల రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆటోమేటిక్‌గా, వాటంతటవే తగ్గిపోతాయని జో బిడెన్ పేర్కొన్నారు.. అందుకే- మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేస్తానని వెల్లడించారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఆ నిబంధనలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

    వంద రోజులు చాలు..

    వంద రోజులు చాలు..

    శాశ్వతంగా కరోనా మాస్కులను ధరించాలని తాను కోరట్లేదనే విషయాన్ని జో బిడెన్ పదేపదే చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు జీవితకాలం పాటు మాస్కులను ధరించమని తాను చెప్పట్లేదని, సరిగ్గా వంద రోజులు చాలని తేల్చి చెప్పారు. ఈ వంద రోజుల్లో కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల్లో ఎలాంటి క్షీణత కనిపిస్తుందో అందరకీ అర్థమౌతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కుల ధారణను తప్పనిసరి చేస్తానని జో బిడెన్ ప్రకటించారు.

     ఆంథోని ఫాసీ కొనసాగింపు..

    ఆంథోని ఫాసీ కొనసాగింపు..

    డాక్టర్ ఆంథోనీ ఫాసీని ప్రధాన వైద్య సలహాదారునిగా కొనసాగింపజేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని జో బిడెన్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పనిచేసిన సలహాదారులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని దశలవారీగా నియమిస్తోన్న జో బిడెన్.. డాక్టర్ ఫాసీని మాత్రం కొనసాగించేలా కనిపిస్తున్నారు. ఆంథోనీ ఫాసీని తన టీమ్‌లోకి తీసుకోవడానికి తాను ఆసక్తిగా ఉన్నానని అన్నారు. ఆయనలో అపార మేథస్సు ఉందని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి తన టీమ్‌లో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా నివారణతో పాటు.. వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి ఆయన సలహాలు ఉపకరిస్తాయని బిడెన్ చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+