ఇట్స్ మై ప్రామిస్- కమలా హ్యారిస్ ప్రకటన

Kamala Harris: గడువు సమీపిస్తోన్న కొద్దీ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. నవంబర్‌ 5వ తేదీన జరుగనుంది. జనవరి 20వ తేదీన ఆ దేశ కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.

2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. అనూహ్య పరిణామాల మధ్య ఈ ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకోవాల్సి వచ్చింది.

US President election 2024 Kamala Harris accepts the Democratic party nomination

ఆయన స్థానంలో కమలా హ్యారిస్ తెరపైకి వచ్చారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హ్యారిస్ నామినేట్ అయ్యారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్ నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ను ఢీ కొట్టనున్నారు.

తాజాగా చికాగోలో డెమొక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో కమలా హ్యారిస్ ప్రసంగించారు. డెమొక్రటిక్ పార్టీ నామినేషన్‌ను స్వీకరిస్తోన్నట్లు అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రతినిధుల సమావేశంలో కమలా హ్యారిస్ ఈ ప్రకటన చేయడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్ నామినేషన్‌ను తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తోన్నానని అన్నారు కమలా హ్యారిస్. ఆమె ఈ ప్రకటన చేయగానే.. పార్టీ ప్రతినిధులు హర్షధ్వానాలు చేశారు. చప్పట్లు కొడుతూ ఈ ప్రకటనను స్వాగతించారు.

డెమోక్రాట్ల సారథ్యంలో సరికొత్త అమెరికా అవతరిస్తుందని మాట ఇస్తున్నానని కమలా హ్యారిస్ చెప్పారు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగుతున్న దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి కృషి చేస్తానంటూ అమెరికన్లందరికీ ప్రామిస్ చేస్తున్నానని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క అమెరికన్‌కూ తాను అధ్యక్షుడిగా ఉంటానని, ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉంటానని, దేశాన్ని, పార్టీని సమున్నతంగా ఉంచడానికి ప్రతి నిమిషం పాటుపడతానని చెప్పుకొచ్చారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే చట్టబద్ధ పాలన, స్వేచ్ఛ, నిష్పక్షపాతంగా పరిపాలన సాగిస్తానని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+