అందుకు సంసిద్ధంగా ఉన్నా: బైడెన్‌తో భేటీలో స్పష్టం చేసిన జిన్‌పింగ్

జకర్తా: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్- చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. ఇండోనేషియాలో ఏర్పాటైన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆ ఇద్దరు దేశాధినేతలు బాలికి చేరుకున్నారు. జీ20 సదస్సు ఆరంభానికి ముందే- వారిద్దరూ ముఖాముఖిగా కలుసుకున్నారు. పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి- అంతర్జాతీయంగా ఎదురవుతోన్న సవాళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం నెలకొన్న పరిణామాలు, ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ప్రస్తావనకు వచ్చాయి.

 తొలిసారిగా..

తొలిసారిగా..

2021 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత జిన్‌పింగ్‌తో జో బైడెన్ ముఖాముఖి భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి. దీనితో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇదివరకు ఈ ఇద్దరు అధ్యక్షులు కూడా అయిదుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘాటు సంభాషణ సాగింది. అంతకుముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గ్ఝి జిన్‌పింగ్‌ ముఖాముఖిగా సమావేశం అయ్యారు.

సంబంధాలు అంతంతే..

సంబంధాలు అంతంతే..

అమెరికా-చైనా మధ్య గల సన్నిహిత సంబంధాలు అంతంత మాత్రమే. ఈ రెండు దేశాల మధ్య చాలాకాలం నుంచి ట్రేడ్ వార్ నడుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం అమెరికా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైరస్ వ్యాప్తి చెందడానికి చైనా కారణమంటూ ఆరోపించడం, దాన్ని జిన్‌పింగ్ తప్పుపట్టడం వంటి పరిణామాలు సంభవించాయి.

 తైవాన్ పర్యటనతో..

తైవాన్ పర్యటనతో..

అమెరికా హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసి తైవాన్ పర్యటన సమయంలోనూ అమెరికా-చైనా మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. తైవాన్‌కు అండగా చైనా నిలివడం పట్ల జిన్‌పింగ్ ఘాటుగా స్పందించారప్పట్లో. న్యాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన కొనసాగుతుండగానే పెద్ద ఎత్తున తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ మోహరింపజేశారు జిన్‌పింగ్. మిలిటరీ డ్రిల్‌లను చేపట్టారు. చైనా గనక యుద్ధానికి దిగితే- తాము తైవాన్‌కు అండగా ఉంటామంటూ బైడెన్ స్పష్టం చేశారు.

కీలక అంశాల ప్రస్తావన..

కీలక అంశాల ప్రస్తావన..

ఇలాంటి పరిణామాల మధ్య బైడెన్-జిన్‌పింగ్ భేటీ కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. తొలుత జిన్‌పింగ్ మాట్లాడారు. ఎట్టకేలకు ఈ ముఖాముఖిగా సమావేశం అయ్యామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చైనా-అమెరికా సంబంధాలు ఆశించిన స్థాయిలో ఉండట్లేదని, వాటిని పట్టాలెక్కించడానికి తాను సంసిద్ధంగా ఉన్నాననీ చెప్పారు.

 సుస్థిరాభివృద్ధికి..

సుస్థిరాభివృద్ధికి..

అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, వాటికి సరైన దిశానిర్దేశాన్ని ఇచ్చేలా తన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. చైనా-అమెరికా సంబంధాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి, ప్రాధాన్యత ఉన్న అంశాలపై నిజాయితీగా, లోతుగా చర్చించాలనేదే తన అభిప్రాయమని జిన్‌పింగ్ తేల్చి చెప్పారు. ఆరోగ్యకరమైన, సుస్థిరాభివృద్ధితో చైనా-అమెరికా సంబంధాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి బైడెన్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+