మేడిన్ అమెరికా: ది గ్రేట్ డీల్- జో బైడెన్ నోట: ఎయిరిండియాకు యూఎస్ విమానాలు

ఎయిరిండియా 22 బోయింగ్ విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది. దీనికోసం కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దీన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్.

వాషింగ్టన్: భారత్ కు చెందిన ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా- సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 290 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయనుంది. దీనికోసం అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎయిర్‌ క్రాఫ్ట్ ఇండస్ట్రీ కంపెనీ ది బోయింగ్ కోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దశలవారీగా ఆయా విమానాలన్నీ త్వరలోనే ఎయిరిండియాలో చేరనున్నాయి. దీనికోసం ఎంత మొత్తాన్ని వ్యయం చేశామనేది ఎయిరిండియా వెల్లడించలేదు.

ఎయిరిండియా కొనుగోలు చేసిన విమానాల్లో 737 మ్యాక్స్, 787 డ్రీమ్ లైనర్, 777 ఎక్స్ విమానాలు ఉన్నాయి. 737 మ్యాక్స్-190, 737-8ఎస్, 737-10ఎస్ రకానికి చెందిన ఫ్లైట్స్ ఉన్నాయి. వాటనిని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులుగా మలచనుంది. 787-9 డ్రీమ్ లైనర్స్ ను ఇంటర్నేషనల్ రూట్లల్లో నడిపించనుంది. 777 ఎక్స్-10, 777-9ఎస్ ఫ్లైట్స్ ను కొనుగోలు చేసింది ఎయిరిండియా. ఈ వివరాలను బోయింగ్ కో వెల్లడించింది.

US President Joe Biden hails as a historic agreement after Air India to purchase 290 Boeing aircraft

ఈ ఒప్పందం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. దీన్ని ఓ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాల తయారీలో తమ దేశానికి ఎదురే లేదని ఈ ఒప్పందం మరోసారి రుజువు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. 200లకు పైగా బోయింగ్ విమానాలను భారత్ కు చెందిన ఎయిరిండియా కొనుగోలు చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

బోయింగ్ కంపెనీతో ఎయిరిండియా కుదుర్చుకున్న తాజా ఒప్పందం వల్ల తమ దేశంలో 44 రాష్ట్రాల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని జో బైడెన్ అన్నారు. నాలుగు సంవత్సరాల ఉన్నత విద్యను పూర్తి చేసుకోని వారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. భారత్- అమెరికా ఆర్థిక సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలోపేతం చేసినట్టయిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను కల్పించుకుంటామని వ్యాఖ్యానించారు.

దశాబ్ద కాలంలో దేశీయ పౌర విమానయానం విస్తరిస్తూ వస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలి వెళ్తోన్నారు. ఫలితంగా- విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ కు అనుగుణంగా పౌర విమానయాన సంస్థలు తమ ఫ్లైట్లను ప్రయాణికులకు చేరువ చేస్తోన్నాయి. తమ సంఖ్యను పెంచుకుంటోన్నాయి. ఇందులో భాగంగా- ఎయిరిండియా 290 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాన్ని కార్యాచరణలో పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+