పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం: చైనా అధ్యక్షుడితో జో బైడెన్ భేటీ - వాట్ నెక్స్ట్?
జకర్తా: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నవంబర్ 14వ తేదీన చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఇండోనేషియాలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన జిన్‌పింగ్‌తో సమావేశమౌతారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు రానున్నాయి. ప్రత్యేకించి- అంతర్జాతీయంగా ఎదురవుతోన్న సవాళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం నెలకొన్న పరిణామాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2021 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత జిన్‌పింగ్‌తో జో బైడెన్ ముఖాముఖి భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి. దీనితో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇదివరకు ఈ ఇద్దరు అధ్యక్షులు కూడా అయిదుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘాటు సంభాషణ సాగింది. అంతకుముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గ్ఝి జిన్‌పింగ్ ముఖాముఖిగా సమావేశం అయ్యారు.
అమెరికా-చైనా మధ్య గల సన్నిహిత సంబంధాలు అంతంత మాత్రమే. ఈ రెండు దేశాల మధ్య చాలాకాలం నుంచి ట్రేడ్ వార్ నడుస్తోంది. అది ఉధృతంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం అమెరికా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైరస్ వ్యాప్తి చెందడానికి చైనా కారణమంటూ ఆరోపించడం, దాన్ని జిన్‌పింగ్ తప్పుపట్టడం వంటి పరిణామాలు సంభవించాయి.

అమెరిా హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసి తైవాన్ పర్యటన సమయంలోనూ అమెరికా-చైనా మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. తైవాన్‌కు అండగా చైనా నిలివడం పట్ల జిన్‌పింగ్ ఘాటుగా స్పందించారప్పట్లో. న్యాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన కొనసాగుతుండగానే పెద్ద ఎత్తున తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ మోహరింపజేశారు జిన్‌పింగ్. మిలిటరీ డ్రిల్‌లను చేపట్టారు. చైనా గనక యుద్ధానికి దిగితే- తాము తైవాన్‌కు అండగా ఉంటామంటూ బైడెన్ స్పష్టం చేశారు.
చైనా నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే అధునాతన చిప్‌ల అమ్మకంపై అమెరికా భారీగా ఆంక్షలను విధించింది. కొన్ని రకాల యాప్‌ల వినియోగాన్ని కూడా నిషేధించింది. దేశ భద్రతను దీనికి కారణంగా చూపించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య జో బైడెన్ - జిన్‌పింగ్ భేటీ కాబోతోండటం ఆసక్తి రేపుతోంది. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇండోనేషియాకు బయలుదేరి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications