దేశీ ఐటీకి పండగే: ఆ ప్రక్రియ మళ్లీ షురూ, అమెరికా నిర్ణయంతో కొత్త ఊపిరి..
ప్రీమియం వీసాలను రద్దు చేసి దేశీ ఐటీ కంపెనీలకు షాక్ ఇచ్చిన అమెరికా.. ఆ ప్రక్రియను తిరిగి పునరుద్దరిస్తోంది.
న్యూయార్క్: ప్రీమియం వీసాలను రద్దు చేసి దేశీ ఐటీ కంపెనీలకు షాక్ ఇచ్చిన అమెరికా.. ఆ ప్రక్రియను తిరిగి పునరుద్దరిస్తోంది. తాత్కాళికంగా నిలిపివేసిన ప్రీమియం వీసాల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ వలసల సేవా సంస్థ (యూఎస్‌సీఐఎస్) మంగళవారం ప్రకటించింది.
గత ఏప్రిల్ నెలలో ట్రంప్ సర్కార్ ప్రీమియం వీసాలపై వేటు వేసింది. విదేశీ వలసలను అరికట్టాలన్న ట్రంప్ పాలసీలో భాగంగా.. ట్రావెల్ బ్యాన్, వీసా నిబంధనలను అమలు చేస్తూ వచ్చింది. తాజాగా ప్రీమియం వీసాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించడంతో దేశీ ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

15రోజుల్లోగా ప్రీమియం వీసా:
ఇటీవలే కొన్ని విభాగాల్లో హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రక్రియను పునఃప్రారంభించిన యూఎస్‌సీఐఎస్, ప్రస్తుతం అన్ని విభాగాలకు ఈ ప్రక్రియను పునరుద్ధరించింది. పిటిషనర్, ఏజెన్సీ ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసును కోరితే, యూఎస్‌సీఐఎస్ 15 రోజుల్లోగా వీసా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.

తత్కాల్ ప్రక్రియ లాగే?:
హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్‌కు ప్రీమియం ప్రాసెసింగ్ తత్కాల్ స్కీమ్ లాంటిదని చెబతున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. హెచ్1బి వీసా కంటే ప్రీమియం వీసాకు అదనంగా 1225 డాలర్లు (దాదాపు రూ.81వేలు) ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

దేశీ ఐటీకి ప్రయోజనం:
ప్రీమియం వీసాల పునరుద్దరణ దేశీ ఐటీ కంపెనీలకు లాభం చేకూర్చనుంది. అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు దక్కాలన్న కారణం కూడా గతంలో ప్రీమియం వీసాల రద్దుకు కారణమైంది. దాంతో ఇక్కడి నుంచి ఉద్యోగుల వలసలకు బ్రేక్ పడటం.. అక్కడివారినే ఎక్కువ జీతాలకు నియమించుకోవాల్సిన అనివార్యత ఏర్పడటం జరిగింది. కానీ తాజా పరిస్థితితో దేశీ ఐటీ కంపెనీలు ఇక్కడి ఉద్యోగులను అక్కడికి పంపించుకునే ప్రాజెక్టులు పూర్తిచేయించుకునే వీలు కలిగింది.

యూఎస్‌సీఐఎస్ డేటా:
యూఎస్‌సీఐఎస్ డేటా ప్రకారం 2007 నుంచి హెచ్-1బీ వీసాల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్న దేశం భారతే. గతేడాది ఐదురోజుల్లోనే హెచ్-1బీ వీసాల కోసం 2,47,927 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ వంటి ప్రత్యేక వృత్తులకు హెచ్-1బీ వీసాలను అందిస్తారు. ప్రతీ ఏటా ఏప్రిల్‌లో ఈ వీసాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏటా 85 వేల వరకూ హెచ్1బీ వీసాలకు అమెరికా అవకాశం కల్పిస్తుంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications