ట్రంప్‌కు 250మంది సీక్రెట్ సెక్యూరిటీ..
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతను 250మంది సీక్రెట్ సెక్యూరిటీ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ట్రంప్ టవర్స్ లోనే ఏర్పాట్లు చేశారు.
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు 250మంది సీక్రెట్ సెక్యూరిటీ ఆయన భద్రతా బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. కాగా, వీరందరికీ ఎక్కడ ఆశ్రయం కల్పిస్తారనే దానిపై మీమాంస ఏర్పడగా.. ప్రస్తుతం దానిపై ఓ స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది.
వసంతకాలం మొత్తం ట్రంప్ టవర్ లోనే నివాసముండాలని ట్రంప్ నిశ్చయించుకున్న నేపథ్యంలో.. ట్రంప్ టవర్స్ లోని 40 అంతస్తుల కింద ఉన్న రెండంతస్తుల్లో సీక్రెట్ సెక్యూరిటీ పోస్టు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడినుంచే వారు విధులు కొనసాగనున్నాయి. ఇప్పటికే ట్రంప్ ఈ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇక సెక్యూరిటీ పర్యవేక్షణ మొత్తం ట్రంప్ టవర్స్ నుంచే కొనసాగనున్నాయి. గతంలో ట్రంప్ సీక్రెట్ సెక్యూరిటీ 17వ అంతస్తు నుంచి భద్రతను పర్యవేక్షించేదని చెబుతున్నారు.

ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా, పదేళ్ల కుమారుడు, కుమార్తె ట్రంప్ టవర్స్ లోని పై అంతస్తులో ఉన్న ట్రిప్లెక్స్ బెడ్ రూంలో ఉండనున్నారు. 40 అంతస్తులున్న ట్రంప్ టవర్స్ లో 26 అంతస్తులు వ్యాపార సముదాయాలే కాగా, మిగతావన్ని నివాస సముదాయాలే కావడం గమనార్హం.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications