హార్మోజ్ జలసంధి మూసివేత.. అమెరికా వెన్నులో వణుకు.. చైనాకు ఫోన్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. గత 8 రోజులుగా సాగుతున్న యుద్ధం అమెరికా ఎంట్రీతో విధ్వంసం మరింత పెరిగింది. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దూరి ఇరాన్ లోని పలు అణు స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ క్రమంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచ ఆర్థిక రంగాన్నే స్తంభింపజేసేలా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది ఇరాన్.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. మరోవైపు అమెరికా సైతం ఇరాన్ పై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేసేందుకు సిద్దం అవుతోంది. ఏ క్షణమైనా ఇరాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో హార్మోజ్ జల సంధిని మూసివేస్తాం అని ఇరాన్ ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా వెల్లడించారు.
అయితే ఇరాన్ హార్మోజ్ జల సంధిని మూసేయడంపై అమెరికా స్పందించింది. ఇదో ఎకనామిక్ సూసైడ్ అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అభివర్ణించారు. ఈ మేరకు హార్మోజ్ జల సంధి నిలిపివేతను ఉపసంహరించుకునేలా ఇరాన్ కు వివరించాలని చైనాను కోరింది అమెరికా. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఇదో పిడుగు లాంటిదని మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ మేరకు చైనా జోక్యం చేసుకుని ఇరాన్ కు నచ్చజెప్పాలన్నారు.
"ఇరాన్ హార్మోజ్ జల సంధిని మూసివేస్తే మరో అతిపెద్ద తప్పు చేసినట్లుగా భావించాలి. ఇరాన్ కు ఎకానమిక్ సూసైడ్ ఇది. అంతేకాక ప్రపంచ దేశాలు ఆర్థికంగా దెబ్బతింటాయి" అని మార్కో రూబియో పేర్కొన్నారు. మరోవైపు అమెరికా జూన్ 21 న ఇరాన్ పై జరిపిన దాడుల్లో ఇరాన్ లోని ఫోర్డో, ఇస్ఫాహాన్, నటాంజ్ అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా రోజూవారీ ముడి చమురు, గ్యాస్ అవసరాల్లో ప్రపంచ దేశాలకు 20శాతం.. భారత్ కు వచ్చే చమురు, గ్యాస్ లో 40 శాతం హార్మోజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇరాన్ తాజాగా తీసుకోబోతున్న నిర్ణయంతో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలపై అధిక ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హార్మోజ్ జల సంధి ఎక్కడుంది..?
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ రవాణాలో హార్మోజ్ జల సంధి చాలా కీలకమైనది. ఈ జల సంధి ఇరాన్.. గల్ఫ్ దేశాల మధ్యలో ఉంటుంది. ఈ మార్గం గుండా రోజూ సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్, యూఏఈ, ఇరాన్ కు చెందిన చమురు ఓడలు ప్రయాణం సాగిస్తాయి. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. సముద్రంలోని ఒక్కో మార్గానికి మధ్య కేవలం 3 కిలోమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది.












Click it and Unblock the Notifications