రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: మూల్యం చెల్లించుకోక తప్పదు: పుతిన్‌కు బైడెన్ వార్నింగ్: తీర్మానం ఆమోదం

వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు.

Recommended Video

    Russia vs America : ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్టే..! - Joe Biden | Oneindia Telugu

    ఈ పరిస్థితుల మధ్య అమెరికా సెనెట్.. ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. సెనెట్ సభ్యులు మూజువాణి ఓటుతో ఈ తీర్మానానికి తమ అంగీకారాన్ని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే తాను ఎటు వైపు మొగ్గు చూపాలనేది ఈ తీర్మానం సారాంశం. నిర్ద్వంద్వంగా ఉక్రెయిన్‌కు మద్దతు పలికేలా రూపొందించిన తీర్మానం అది. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి సెనెట్ ఈ తీర్మానంపై ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.

    US Senate Approves Resolution supporting Ukraine and Warning Russia as impose significant costs

    ఈ తీర్మానం విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు సంయుక్తంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తలెత్తితే అది యూరోపియన్ వార్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి అన్ని విధాలుగా తమ ప్రయత్నాలను సాగిస్తున్నామని సెనెట్ సభ్యులు స్పష్టం చేశారు. ఈ విషయంలో సెనెట్ ఏకతాటిపైకి వచ్చిందని, ఏ సభ్యుడు కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని అమెరికన్ మీడియా తెలిపింది.

    ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే రష్యా- తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదంటూ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇదివరకే హెచ్చరించారు. ఇదే విషయాన్ని సెనెట్ సభ్యులు ఉటంకించారు. రష్యాను ఎలా నియంత్రించాలనే విషయంపై సెనెట్‌లో చర్చించామని డెమోక్రటిక్ సెనెటర్ జియాన్నె షహీన్ తెలిపారు. రష్యాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఆంక్షలను విధించాలనే విషయం చర్చకు వచ్చిందని వివరించారు. ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.

    అమెరికా ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. కొంతమంది కీలక అధికారులు మినహా.. మిగిలిన వారందరినీ స్వదేశానికి పిలిపించుకుంది. ఉద్రిక్తతలను నివారించడంలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వచ్చేవారం రష్యాకు వెళ్లనున్నారు. రష్యా విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+