ఇజ్రాయెల్‌లో దిగిన అమెరికా యుద్ధ సామాగ్రి: ఏం జరుగుతోంది..?

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. అయిదో రోజూ కొనసాగుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.

శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో ఇప్పటికి 1,000 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. రాకెట్ దాడుల్లో వేలాది మంది పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటోంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతుందనే అంచనాల ఉన్నాయి.

US sent war armaments to Israel, IDF confirms

అటు గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 700 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. అక్కడా పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. హమాస్ మిలిటెంట్ల అంతు చూస్తామంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతోంది.

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఈ యుద్ధంలో 14 మంది అమెరికన్లు మరణించినట్లు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. యుద్ధ పరిణామాలపై వైట్ హౌస్‌లో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ శాఖ మంత్రి ఆంటొని బ్లింకెన్ సహా పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు.

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హమాస్ మిలిటెంట్ల చర్యలను తప్పుపట్టారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆ దేశానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఇప్పటికే ఆయుధ, యుద్ధ సామాగ్రిని పంపించామని, ఆర్థిక సహకాన్ని సైతం అందజేస్తామని చెప్పారు.

అమెరికా పంపించిన యుద్ధ సామాగ్రి, సైన్యంతో కూడుకున్న మొట్ట మొదటి విమానం ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అయింది. దక్షిణ ప్రాంతంలోని నెవాటిన్ ఎయిర్ బేస్‌లో ఈ ఫ్లైట్ దిగంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. మరింత యుద్ధ సామాగ్రి, మానవ సహకారం అందుతుందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+