వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కు బాలుడిపై స్కూల్ బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు: వీడియో హల్‌చల్

By Pratap
|
Google Oneindia TeluguNews

జార్జియా: అమెరికాలోని జార్జియాలో ఓ సిక్కు బాలుడు పాఠశాల బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలకు గురయ్యాడు. పాఠశాల పిల్లలు కొందరు అతన్ని టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సిక్కు బాలుడు పాఠశాల బస్సులో కూర్చుని ఉన్నట్లు, అతని చుట్టూ కొంత మంది పిల్లలు చేరినట్లు వీడియోలో కనిపిస్తోంది.

తన పట్ల పిల్లలు జాతివివక్షను ప్రదర్సిస్తున్నారంటూ ఆ బాలుడు గుసగుసగా చెప్పిన మాటలు కూడా రికార్డు అయ్యాయి. అతని వెనక కూర్చున అమ్మాయి బాలుడి వైపు వేలు పెట్టి చూపిస్తూ టెర్రరిస్టు, టెర్రరిస్టు అంటూ గట్టిగా అరవడం కూడా రికార్డు అయింది. ఇంక్విస్టర్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు.

వీడియోను నగ్రా నగ్రా అనే యూజర్ పోస్టు చేశాడని, ఆ బాలుడుని హర్షుఖ్ సింగ్‌గా గుర్తించాడని ఇంక్విస్టర్ తెలిపింది. సింగ్ తానే ఆ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దానికి లక్షా 30 వేల వ్యూస్ వచ్చాయి. పిల్లలు తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని, తనను అఫ్గాన్ ఉగ్రవాదిగా పిలిచారని, తన వంటి వారి పట్ల ఆ విధంగా వ్యవహరించవద్దని, తాను ముస్లింను కాననీ సిక్కునని అతను ఆ వీడియోకు వివరణ రాశాడు. ఆ సిక్కు బాలుడు డులుత్‌లోని చట్టాహూచీ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నట్లు ఇంక్విస్టర్ తెలిపింది.

వారం రోజుల క్రితం సియాటిల్‌లోని ఓ హిందూ దేవాలయంపై దాడి జరిగిన సంఘటనను మరిచిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది.

English summary
A young Sikh boy in the US state of Georgia has been called a "terrorist" by a group of school children, with the video of the abuse now going viral on the Internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X