ఆలయంలో నగ్నంగా ఫొటోలు దిగిన అక్కా చెల్లెళ్లు: అరెస్ట్
నాంపెన్: ఓ దేవాలయంలో నగ్నంగా ఫోటోలు దిగిన ఇద్దరు సోదరీమణులు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన కాంబోడియాలోని ప్రఖ్యాత అంగ్‌కోర్‌వాట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమెరికాకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెల్లు లిండ్సీ(22), లెస్లీ(20)లు.
ప్రఖ్యాత అంగ్‌కోర్ వాట్ దేవాలయంలో నగ్నంగా ఫొటోలు దిగడంతో ఆలయాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీ అయిన అప్సర అథారిటీ వారిద్దరిని అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ చేసింది తప్పేనని అథారిటీ పేర్కొంది.

గత పక్షం రోజులుగా ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ముగ్గురు ఫ్రెంచి పర్యాటకులు బట్టలన్నీ విప్పివేసి ఫొటోలకు ఫోజిచ్చినందుకు నాలుగేళ్ళు కాంబోడియాకు వారు రాకుండా నిషేధం విధించారు.
అప్సర అథారిటీ అధికార ప్రతినిధి చౌ సున్ కెర్యా ఘటనపై స్పందిస్తూ అమెరికా అక్కాచెల్లెళ్లు చేసింది నేరమేనని అన్నారు. అయితే ఆ పర్యాటకులకు ఆంగ్‌కోర్ వాట్ ఆధ్యాత్మిక స్థలమని తెలియకపోవచ్చని పేర్కొన్నారు. ఆ అక్కా చెల్లెళ్లను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఎంతో ప్రసిద్ధి చెందిన అంకోర్ వాట్ దేవాయలం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.












Click it and Unblock the Notifications