వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక చంద్రుడిపై బీర్ తయారీ: అమెరికన్ విద్యార్థుల ప్రయోగం..

నౌక అంతరిక్షంలోకి చేరాక బీర్ క్యాన్ లోపలి వాల్వ్స్ తెరుచుకుని ఈస్ట్, బీర్ రెండు కలిసిపోతాయి.

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజెల్స్: అంతరిక్ష ప్రయోగాల క్రమం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏకంగా చంద్రుడిపై 'బీర్' ను తయారుచేసే సరికొత్త ప్రయోగాలకు నవతరం శాస్త్రజ్ఞులు నాంది పలుకుతున్నారు. తాజాగా 'ల్యాబ్ టూ మూన్' పోటీల్లో విజేతలుగా నిలిచిన కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

ప్రయోగంలో భాగంగా.. వచ్చే డిసెంబర్ 28న చంద్రుడి పైకి అంతరిక్ష నౌకను పంపించనున్నారు. విద్యార్థులు తాము రూపొందించిన బీర్ క్యాన్ ను అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడి పైకి పంపిస్తారు. బీర్ క్యాన్ లో మొత్తం మూడు లోహపు విభాగాలు ఉంటాయి. ఒక భాగంలో పులియని బీరు, మరో భాగం ఈస్ట్ తో నిండి ఉంటుంది.

US student team plans to brew beer on the moon

నౌక అంతరిక్షంలోకి చేరాక బీర్ క్యాన్ లోపలి వాల్వ్స్ తెరుచుకుని ఈస్ట్, బీర్ రెండు కలిసిపోతాయి. ఈ మిశ్రమంతో పులియబెట్టిన బీరు తయారవుతుంది. కాగా, చంద్రుడి మీద బీర్ ను ఎంతమేర పులియబెట్టవచ్చనేది ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశ్యం కావడం గమనార్హం.

English summary
A team of students in the U.S. is planning to brew beer on the moon for the first time. The team plans to send a canister aboard an Indian lunar lander that is set to launch this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X