ట్రావెల్ బ్యాన్ ఇష్యూ: ట్రంప్‌ సర్కార్‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు

వాషింగ్టన్‌: ట్రావెల్ బ్యాన్ అంశంలో ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊరటనిచ్చే తీర్పు. ఆరు ముస్లిం దేశాల పౌరులను అమెరికా రావడాన్ని నిషేధించడంపై వేర్వేరు రాష్ట్రాలతో తలెత్తిన వివాదంలో డొనాల్డ్‌ ట్రంప్‌ న్యాయపరంగా విజయం సాధించారు.

మార్చి 6న ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆరు ముస్లిం దేశాల పౌరుల రాకపై ట్రంప్‌ 90 రోజుల నిషేధం విధించగా.. మేరీల్యాండ్‌, హవాయి. ప్రభుత్వాలు వ్యతిరేకించి న్యాయపోరాటానికి దిగాయి.

 US supreme court dismisses challenge to Trump travel ban

ఫలితంగా రిచ్‌మండ్‌, వర్జీనియా, శాన్‌ప్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని అప్పీళ్ల కోర్టులు ట్రంప్‌ ఆదేశాల అమలుపై స్టే విధించాయి. స్టేను వ్యతిరేకిస్తూ శ్వేతసౌధం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. 90 రోజుల నిషేధం ముగిసిన తర్వాత ఈ తీర్పు వచ్చినా వలస విధానం కఠినతరం చేసే అంశంలో ట్రంప్‌కు మరింత మద్ధతు లభించినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+