యూఎస్ డ్రోన్ దాడులు: పాక్ లో తాలిబన్ చీఫ్ అంతం
వాషిగ్టన్: అమెరికా సైనిక దళాలు మరో సారి తాలిబన్ నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు చేశాయి. అమెరికా దాడుల్లో తాలిబన్ చీఫ్ ముల్లాహ్ అక్తర్ మన్సూర్ అంతం అయ్యాడు. అమెరికా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. తాలిబన్ అగ్రనేత అంతం కావడంతో ఉగ్రవాదులకు కోలులోలేని దెబ్బపడింది.
అఫ్గాన్ లో శాంతి ప్రక్రియలకు ఇంత కాలం అడ్డుపడుతూ పెను ముప్పుగా పరిణమించిన తాలిబన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మన్సూర్ మరణంతో అఫ్గాన్ లో ఇక మీద శాంతి నెలకొంటుందని అమెరికా భావిస్తుంది. అఫ్గాన్ సరిహద్దులోని పాకిస్థాన్ లో ఉన్నబెలుచిస్తాన్ లో రహస్య ప్రాంతంలో మన్సూర్ తలదాచుకుడున్నాడు.
ఈ విషయాన్ని అమెరికా సైన్యం పసిగట్టింది. శనివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండ మానవరహిత డ్రోన్ల ద్వారా వైమానిక దాడులు జరిపి మన్సూర్ ను అంతం చేశారు. మన్సూర్ అంతం అయ్యాడని అమెరికా, అఫ్గాన్ అధికారులు నిర్ధారించారు. డ్రోన్ దాడులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతి ఇచ్చారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.

అహమ్మద్ వాల్ టౌన్ కు సమీపంలోని మారుమూల ప్రాంతమైన దాల్బంది ప్రాంతంలో మన్సూర్ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు వాహనంలో వెలుతున్న సమయంలో డ్రోన్ ల సహాయంతో దాడులు చేశామని అమెరికా సైనిక దళాలు తెలిపాయి. తాలిబన్ చీఫ్ మన్సూర్ తో అమెరికా సైనిక బలగాలకు, అఫ్గాన్ ప్రజలకు ముప్పు ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చెప్పారు.
తాలిబన్ గ్రూప్ కొత్త నాయకుడిని ఎన్నుకుని కాబూల్ వచ్చి ఒక రాజకీయ పార్టీ లాగా ప్రజలతో కలిసి ఉండాలని అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి దౌలత్ వాజిరి తాలిబన్లకు హితవు పలికారు. తాలిబన్ నాయకుడు బిన్ లాడెన్ అంతం అయిన తరువాత పగ్గాలు చేపట్టిన తాలిబన్ల నేత ముల్లా అహమ్మద్ ఒమర్ 2013లో పాక్ లో చనిపోయాడు.
ఆ సమయంలో పగ్గాలు చేపట్టిన మన్సూర్ ఇప్పడు అమెరికా చేతిలో అంతం అయ్యాడు. అయితే అమెరికా తమ అనుమతి లేకుండా మా భూ భాగంలో ఇలా దాడులు చెయ్యడం తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిదన పాకిస్ధాన్ ప్రభుత్వం నోరు పారేసుకుంది. తాము తాలిబన్లకు ఆశ్రయం ఇవ్వలేదని పాత పాటే పాడుతున్నది.












Click it and Unblock the Notifications