ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు అమెరికా యువకుడి విఫలయత్నం: దొరికిపోయాడు
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ఓ అమెరికన్ యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడమే కాకుండా వాటి చుట్టుపక్కల మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, హంజా అహ్మద్(19) అనే యువకుడు మరో ముగ్గురితో కలిసి జంట నగరాలైన మిన్నేపొలిస్ నుంచి న్యూయార్క్ నగరానికి వచ్చి అక్కడి నుంచి సిరియాకు వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు యత్నించినట్లు తమ దర్యాప్తులో తేలిందని యుఎస్ అటార్నీ ఎం ల్యూగర్ తెలిపారు.

కోర్టులో ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం.. అహ్మద్ తోపాటు మరో ముగ్గురు మిన్నేపోలిస్ నుంచి బస్సులో న్యూయార్క్‌లోని జాన్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయాని(జెఎఫ్‌కె)కి చేరుకున్నారు. ఆ నలుగురు కూడా 2014, నవంబర్ 8న అంతర్జాతీయ విమానంలో నాలుగు టెకెట్లను బుక్ చేసుకున్నారు.
అహ్మద్, మరో గుర్తు తెలియని వ్యక్తి అదే విమానంలో జెఎప్‌కె నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. మరో ముగ్గురు విమానానికి దూరంగా ఉన్నారు. విమానం ఎక్కిన అహ్మద్‌ను యుఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటక్షన్ ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎఫ్‌బిఐ అధికారులు అహ్మద్‌ను పలుమార్లు విచారించారు. అతడు ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తేల్చారు.












Click it and Unblock the Notifications