రష్యా మిసైల్స్ ఒప్పందం: ఆంక్షలు తప్పవంటూ భారత్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
Recommended Video

వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా విషయంలో భారత్‌కు మరోసారి అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎస్ 400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఎస్ 400 మిసైల్స్ కొనుగోలు చేయొద్దని కొన్ని నెలలుగా భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది.
అయితే, తమ హెచ్చరికలను భేఖాతరు చేస్తూ చర్చలు జరుపుతోందనే నెపంతో అమెరికా.. భారత్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉంది. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారం భారత్ సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలోనే ఎస్ 400 క్షిపణులకు సంబంధించి కొనుగోలు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయొచ్చని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ భారత్ గనుక ఆ క్షిపణులను కొనుగోలు చేస్తే.. అమెరికా చట్టాల ప్రకారం భారత్‌పై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. కాగా, పాకిస్థాన్, చైనాల దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఎస్ 400 క్షిపణులు అవసరమని భారత రక్షణ దళాలు భావిస్తున్నాయి. దీంతో వీటి కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది.
పుతిన్ సంతకం చేయనున్న ఈ ఒప్పందం విలువ సుమారు 500కోట్ల డాలర్ల(రూ.36,500కోట్లు)ని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే క్షిపణిని రష్యా నుంచి కొనుగోలు చేసినందుకు చైనాపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించడం గమనార్హం.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications