భారత ఐటీ రంగంపై ట్రంప్ పిడుగు
Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి కొరడా ఝుళింపించారు. అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు. భారీగా టారిఫ్‌ను పెంచారు. ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 26 శాతం మేర టారిఫ్ విధించారు భారత్‌పై.
మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కిందటి నెల 31వ తేదీ నాడే సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

అక్కడితో ఆగట్లేదాయన. ఇప్పుడు కొత్తగా భారత్‌పై 26 శాతం వరకు టారిఫ్ విధించారు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్‌కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్‌లో భాగంగా టారిఫ్‌ను విధించాల్సి వస్తోందంటూ వివరణ ఇస్తోన్నారు.
ఈ క్రమంలో మరో అడుగు ముందుకేశారు ట్రంప్. రక్షణ శాఖకు సంబంధించిన టెక్ దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయడానికి సిద్ధపడ్డారు. బిలియన్ల కొద్దీ డాలర్ల కాంట్రాక్ట్‌లు రద్దు కానున్నాయి. ఫలితంగా ఐటీ రంగం తీవ్ర కుదుపులకు లోనవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
కాస్ట్- కటింగ్ చర్యలో భాగంగా డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలతో గతంలో కుదుర్చుకున్న 5.1 బిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టులను రద్దు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు. డెలాయిట్, యాక్సెంచర్, బూజ్ అలెన్, హామిల్టన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
🚨NEW: Pete Hegseth says the DoD is cutting .1B in wasteful DoD contracts
— Autism Capital 🧩 (@AutismCapital) April 10, 2025
- .8B in DHA contracts for consulting services from Accenture, Deloitte, Booz Allen
- .4B in "Enterprise Cloud IT services"
- 0M Navy contracts for "Business consulting"
- 0 hour "Business… pic.twitter.com/BcbodNtTNo
వాటికి మంజూరు చేసిన 5.1 బిలియన్ డాలర్ల ఐటీ, కన్సల్టింగ్ కాంట్రాక్టులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పెంటగాన్ మెమోలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కాంట్రాక్టులు- థర్డ్ పార్టీ కన్సల్టెంట్లుగా అభివర్ణించారు. అవన్నీ కూడా అనవసరమైన ఖర్చుగా పేర్కొన్నారు. అవే పనులు పెంటగాన్ సిబ్బంది అంతర్గతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు హెగ్‌సెత్ చెప్పారు.
ఈ కాంట్రాక్టులను రద్దులను చేయడం ద్వారా దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇకపై కన్సల్టింగ్, ఇతర అనవసరమైన సేవల వంటి అనుబంధ విషయాల కోసం థర్డ్ పార్టీ కంపెనీల మీద ఆధారపడబోదని హెగ్‌సెత్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
To our warfighters, and the American taxpayers we will continue to deliver on our promise of transparency.
— DOD Rapid Response (@DODResponse) April 11, 2025
This is what we did this week🇺🇸 pic.twitter.com/JcZLlHzTyY
రక్షణ వ్యయాన్ని క్రమబద్ధీకరించడం, అంతర్గత సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఈ కోతలు పెట్టినట్లు చెప్పారు. రద్దయిన కాంట్రాక్టులు అన్నీ కూడా ఎయిర్ ఫోర్స్, నౌకాదళం, డార్ఫా, డిఫెన్స్ హెల్త్ ఏజెన్సీలకు సంబంధించినవి. వీటితో పాటు పలు రక్షణ సంస్థలకు సంబంధించిన అనుబంధ పనులు ఇందులోఉన్నాయి.
ఈ ప్రకటన వెలువడిన తరువాత ఆయా కంపెనీల షేర్లు పడిపోయాయి. న్యూయార్క్‌లో ఉదయం ట్రేడింగ్‌లో యాక్సెంచర్ షేర్ ధర రెండు శాతం మేర తగ్గింది. 279.52 డాలర్లకు పడిపోయింది. బూజ్ అలెన్ హామిల్టన్ కంపెనీ స్టాక్స ధర 2.4 శాతం మేర తగ్గి 106.30 డాలర్ల వద్ద నిలిచింది.












Click it and Unblock the Notifications