US VISA : భారతీయులకు ట్రంప్ మరో షాక్. వీసాల ఫీజులు భారీగా పెంపు
అమెరికా వీసా అందని ద్రాక్షలా పూర్తిగా మారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే అగ్రరాజ్యం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఇక అమెరికా అంటే వద్దే వద్దు అన్నట్లుగా చేసేలా ఉంది ధోరణి. ఇటీవలే వీసా ఫీజు పెంచిన ట్రంప్ ఇప్పుడు మరోసారి బాంబు పేల్చారు. గణనీయంగా యూఎస్ వీసాకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్ట్యా మరొ కొత్త రూల్ ను మన నెత్తిన రుద్దేశాడు. దీంతో అమెరికా వెళ్లాలి అనుకుంటున్న వారికి తడిచి మోపెడు అయ్యేలా ఉంది ఖర్చు.
భారతీయులు ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా అమెరికాకు ఎడ్యుకేషన్ కోసం, జాబ్స్ కోసం వెళ్తున్నారు. H‑1B వీసా ఐటీ ఉద్యోగ అవసరాల కోసం, F‑1 వీసా విద్యార్థుల కోసం, L‑1 వీసా కంపెనీల అవసరాల కోసం తయారు చేశారు. ఈ వీసాల్లో ప్రీమియం ప్రాసెసింగ్ తీసుకోవడం అంటే మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి అప్లికేషన్ వేగంగా ప్రాసెస్ చేయించుకోవడం. ఇప్పుడు ఈ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంపు భారీగా పెంచింది అమెరికా.

మార్చి 1 నుంచి అమలులోకి..
అమెరికా కొత్తగా H‑1B, L‑1, F‑1 వంటి ప్రీమియం ప్రాసెసింగ్ వీసాల ఫీజులను పెంచింది. మార్చి 1, 2026 నుంచి H‑1B, L‑1 వీసాల ప్రీమియం ఫీజులు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇక F‑1, J‑1 విద్యార్థి వీసాల ప్రీమియం ఫీజులు 1,965 నుంచి 2,075 డాలర్లకు పెంపు చేశారు. ఇది అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు, నిపుణులు, ఉద్యోగార్ధులకు బిగ్ షాక్.
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) ద్వారా విడుదలైన ప్రకటనలో 2023‑25 మధ్య ప్రపంచంలో వచ్చిన ద్రవ్యోల్బణాన్ని (inflation) ఈ ఫీజు పెంపుకు కారణంగా చూపించారు. USCIS ప్రకటనలో "వీసా ప్రక్రియలో చాలా కీలమైన ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లడానికి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాం" అని పేర్కొంది
ఇదేం మొదటి సారి కాదు
ఇది H‑1B వీసా ఫీజులపై డబుల్ షాక్ గా చెప్పవచ్చు. గతంలో కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైన కాలంలో ఈ వీసాలపై పెద్ద సంఖ్యలో ఫీజుల పెంపులు, షరతులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ట్రంప్ పాలసీలు ఎక్కువగా "అమెరికన్ ఉద్యోగాల రక్షణ" అనే పేరు పెట్టుకుని, విదేశీ కార్మికుల సంధానాన్ని కఠినంగా మార్చాయి. H‑1B వీసాల కేటాయింపు, సిలబస్ అప్‌డేట్‌లకు అనేక మార్పులు వచ్చిన సమయంలో.. వీసాల ధరలు పెంచారు. అంతే కాకుండా, ప్రాసెసింగ్ సమయంలో కూడా భారీగా విధానపరమైన మార్పులు కనిపించాయి.
అలా గతంలో వచ్చిన ఫీజు పెంపుల వల్ల ఇప్పటికే భారతీయ ఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిగ్రీ విద్యార్థులు భారీగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మరికొకసారి ప్రాసెసింగ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications