Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు సహకరిస్తే తీవ్రపరిణామాలు : అమెరికా హెచ్చరిక

ఉక్రెయిన్‌పై రష్యా దళాలు మిస్సైల్స్‌తో దాడులకు తెగబడుతున్నాయి. మిలటరీ స్థావరాలే కాదు జననివాస ప్రాంతాలపై కూడా బాంబులను విసురుతోంది. ప్రభుత్వ కార్యాల‌యాల‌ను టార్గెట్ చేస్తూ ద్వంసం చేస్తోంది. దీంతో ఉక్రెయిన్‌లో భయాందోళ‌న‌క‌ర‌ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నారు. రష్యా బాంబుల దాడులతో వందల సంఖ్యలో సైనికులు, పౌరులు మరణించారు.

 బెలార‌స్‌కు అమెరికా హెచ్చ‌రిక‌

బెలార‌స్‌కు అమెరికా హెచ్చ‌రిక‌

ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తూ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై మరింత రెచ్చిపోతోంది. భారీగా తమ బలగాలను మోహరించింది. బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు మద్దతు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని బెలారస్‌ను అమెరికా హెచ్చరించింది. ఈమేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. బెలారస్ సరిహద్దుల్లో రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా ఈ కీలక ప్రకటన చేసింది.

రష్యా యుద్ధంలో పాలుపంచుకుంటే..

రష్యా యుద్ధంలో పాలుపంచుకుంటే..


బెలారస్‌లోని స్థావరాలను ఉపయోగించుకుని తమపై దాడులకు దిగుతోందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ఆ ప్రాంతంలో రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు కూడా తొలుత ఒప్పుకోలేదు. చివరకు ఒప్పుకున్నా .. ఆ చర్చలు విఫలమైయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా తలపెట్టిన యుద్ధంలో బెలారస్ పాలుపంచుకుంటుందనే నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోకు అమెరికా గట్టిగానే హెచ్చరించింది.

Recommended Video

    Russia-Ukraine Conflict: Everyone is afraid, no one answers said Ukraine President
    కీవ్‌ను చుట్టుముట్టిన ర‌ష్యా బ‌ల‌గాలు

    కీవ్‌ను చుట్టుముట్టిన ర‌ష్యా బ‌ల‌గాలు

    మరో వైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. జనావాసాలపై దాడులకు తెగబడుతోంది. దీంతో రాజధాని నగరం అల్లకల్లోలంగా మారింది. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. కీవ్‌తో పాటు పశ్చిమ నగరాలైన రివ్నే, టెర్రోపిల్ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్ల మోతలు వినిపించాయి. కీవ్ వైపు రణ్యా సేనలు ముందుకు సాగుతున్నాయి. భారీ సాయుధ కాన్వాయ్‌తో రష్యా దూసుకోస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+