కొండనుండి తోసి..: హానీమూన్‌లో భర్తని చంపిన భార్య!
వాషింగ్టన్: పెళ్లైన వారం రోజులకే ఓ భార్య తన భర్తను హత్య చేసిన ఆభియోగాలు ఎదుర్కొంటున్న సంఘటన అమెరికాలో జరిగింది. వివరాల ప్రకారం... 22 ఏళ్ల జోర్డాన్ లిన్ గ్రాహమ్ తన 25 ఏళ్ల భర్త కోడీ లీ జాన్సన్‌ను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటోంది.
సమాచారం మేరకు లిన్ తన భర్త కోడీని నేషనల్ పార్కులోని ఓ కొండ పై నుండి తోసేసింది. పెళ్లి అనంతరం వారు జూలై 7న హానీమూన్ కోసం వెళ్లారు.

మొదట తన భర్త కనిపించడం లేదని చెప్పిన లిన్, ఆ తర్వాత తన తప్పును అంగీకరించిందట. ఆమె సోమవారం భర్త హత్య కేసులో కోర్టుకు హాజరయింది. ఆమె దోషిగా నిర్ధారించబడితే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది.
కోడీ మృతదేహం జూలై 12న పార్కులో లభించింది. శవ పరీక్షలు జూలై 19న చేశారు. కోడీ కుటుంబ స్నేహితురాలు ఒకరు మాట్లాడుతూ స్థానిక పత్రికతో మాట్లాడుతూ... లిన్ తన భర్త హత్య కేసులో అభియోగాలు ఎదుర్కోవటంపై ఎవరు ఆశ్చర్యపోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications