బేకన్ లేకుండా బర్గర్ ఇచ్చారని మెక్‌డొనాల్డ్స్‌పై మహిళ కాల్పులు: జైలు

వాషింగ్టన్: రెండుసార్లు తనకు ఇచ్చిన బర్గర్‌లో బేకన్ లేకుండా తెచ్చారని అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఓ మహిళ మెక్‌డొనాల్డ్ డ్రైవ్ త్రూపై కాల్పులు జరిపింది. దీంతో మెక్‌డొనాల్డ్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.

కోర్టుకు వరకు వెళ్ళిన ఈ ఘటనపై విచారించిన న్యాయమూర్తి.. నిందితురాలు షనేకా మోనిక్యూ టోర్స్(30)కు మూడేళ్ల నుంచి ఏడేళ్ల లోపు జైలు శిక్షను విధించినట్లు బుధవారం ఏబిసి మీడియా పేర్కొంది.

వివరాల్లోకి వెళితే.. షనేకా మోనిక్యూ టొర్రెస్ 2014 ఫిబ్రవరి10 రాత్రి తన స్నేహితురాలితో కలసి మెక్ డొనాల్డ్స్‌కి వెళ్లింది. మీల్స్‌తో పాటూ బేకన్ చీస్ బర్గర్ ఆర్డర్ చేసింది. మీల్స్ వచ్చినా బేకన్ సర్వ్ చేయలేక పోవడంతో మేనేజర్.. షనేకాకు క్షమాపణ చెప్పి మీల్స్‌ని ఉచితంగా ఇస్తానని చెప్పారు.

US woman jailed after McDonald’s shooting over burger

అదే రోజు కొన్ని గంటల తర్వాత షనేకా తిరిగి మెక్ డొనాల్డ్స్‌కి వచ్చింది. ఆమె మళ్లీ బర్గర్ ఆర్డర్ చేసినా.. అప్పుడు కూడా బేకన్ లేకుండానే మీల్స్ ఇవ్వడంతో ఆగ్రహం పట్టలేని షనేకా తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. అయితే అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు. మెక్‌డొనాల్డ్స్ షాపు మాత్రం కొంత ధ్వంసమైంది.

దీంతో ఆమెపై మెక్‌డొనాల్డ్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు విచారణ సందర్భంగా... కాల్పులు అనుకోకుండా జరిగిన సంఘటనగా పరిగణించాలని షనేకా తరపు న్యాయవాది కోరాడు. అనుకోకుండా జరిగినా ఆ కాల్పుల్లో తుపాకీ బుల్లెట్లు ఎవరికైనా తగిలితే ప్రాణాలు పోయే అవకాశం ఉండటంతో న్యాయమూర్తి ఆమెకు మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్ష విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+