బస్సు మిస్: అంబులెన్స్ ఎత్తుకుపోయింది

న్యూయార్క్: ఇంటికి ఆలస్యంగా బయలుదేరిన మహిళ చివరి బస్సు వెళ్లిపోవడంతో ఆసుపత్రి ముందు నిలిపి ఉన్న అంబులెన్స్ తో ఉడాయించింది. చివరికి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్ప్రింగ్ ఫీల్డ్ టౌన్ షిప్ లో లీసా కార్ (43) అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె రాత్రి షాపింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరారు.

అయితే అప్పటికే చివరి బస్సు వెళ్లిపోయింది. సమీపంలోని ఆసుపత్రి దగ్గర అంబులెన్స్ పార్క్ చేసి రోగిని పిలుచుకుని డ్రైవర్ లోపలికి వెళ్లాడు. అంబులెన్స్ డ్రైవర్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతున్న సమయంలో ఆమె అంబులెన్స్ ఎత్తుకు వెళ్లింది.

US woman who missed bus is charged with stealing Ambulance

విషయం తెలుసుకున్న పోలీసులు లీసా కార్ మీద కేసు నమోదు చేశారు. ఆమె కావాలనే అంబులెన్స్ ఎత్తుకు వెళ్లిందని పోలీసులు హమిల్టన్ మున్సిపల్ కోర్టులో నివేదిక సమర్పించారు.

ఆమె మీద దొంగతనం చేసిందని కేసు నమోదు చేశారు. లీసా కారు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఇంటికి వెళ్లేందుకు బస్సు లేకపోవడం వలనే తాను అంబులెన్స్ ఎత్తుకుపోయానని, తనను క్షమించాలని లీసా అంటున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+