USA Visa Rules: అమెరికా వీసా రూల్స్ లో భారీ మార్పులు.. భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!

అమెరికా వెళ్లాలని చాలామంది డ్రీమ్ గా పెట్టుకుంటారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం ప్రపంచ దేశాల నుంచి అమెరికా వెళ్తుంటారు. అలాగే భారత్ నుంచి కూడా నిత్యం వేలాది మంది యువతీయువకులు అమెరికాకు పయనమవుతుంటారు. అక్కడే ఏదైనా ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని అనుకునే వారికి అక్కడి ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.

ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానానికి ఇక ముగింపు పలుకుతూ.. విద్యార్థులకు నిర్దిష్ట కాలపరిమితితో అమెరికాలో ఉండే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. యూఎస్ వీసా సిస్టమ్ పై పర్యవేక్షణ పెంచడం.. అలాగే జాతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.

హార్మూజ్‌లో యూఏఈ ట్యాంకర్‌లపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
హార్మూజ్‌లో యూఏఈ ట్యాంకర్‌లపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి

అమెరికాలో ప్రస్తుతం డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ప్రకారం ఎఫ్-1 వీసా కలిగిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకూ అమెరికాలో చట్టబద్ధంగా ఉండే అధికారం ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్ ప్రకారం.. ఎఫ్-1 విద్యార్థులకు సాధారణంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఒకవేళ ఈ సమయంలోపు స్టడీస్ పూర్తికాకపోతే అదనపు గడువు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.

ట్రంప్ సంచలన ప్రకటన.. హార్మూజ్ కార్గో ఫీజు రద్దు
ట్రంప్ సంచలన ప్రకటన.. హార్మూజ్ కార్గో ఫీజు రద్దు

ఈ నిబంధన కారణంగా ఎఫ్-1 విద్యార్థులతో పాటు జే-1 ఎక్స్‌ ఛేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధులకు జారీ చేసే ఐ వీసాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ సరికొత్త రూల్స్ ను ప్రతిపాదించింది. అయితే.. ఈ ప్రతిపాదన వెంటనే అమలు కాకపోవచ్చు. దీనికి ముందుగా అమెరికన్ కాంగ్రెస్ సమీక్ష, ఆమోదం తప్పనిసరి కావాలి. కానీ భారతీయ విద్యార్థుల్లో మాత్రం ఈ రూల్ కారణంగా ఆందోళన నెలకొంది.

USA Visa Rules Major changes to US visa rules a big shock for Indian students USA Visa Rules

ఇక తాజా గణాంకాల ప్రకారం.. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3.31 లక్షలుగా ఉంది. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. వీరు మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 శాతంగా ఉన్నారు. ఇక కొత్త నిబంధన అమల్లోకి వస్తే నాలుగేళ్ల గడువులోగా విద్యను పూర్తి చేయలేని విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం అయితే ఆ విద్యార్థుల చట్టపరమైన నివాస స్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+