అమెరికా మహిళ హ్యాడ్ బ్యాగ్ లో పసిపాప, ఎయిర్ పోర్టులో అరెస్టు, కిడ్నాప్, నేను ఆంటీ !

మనీలా: అక్రమంగా ఆరు రోజుల పసికందులు (చిన్న పిల్లలు)ను తరలిస్తున్న అమెరికా మహిళను ఫిలిపెన్స్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అమెరికా మహిళ జన్నీఫర్ టాల్ బోటో (43) హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న పసికందును రక్షించిన అధికారులు పాపను ఆసుపత్రికి తరలించారు.

అమెరికా మహిళతో పాటు చిన్నారి తల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాలోని ఓహియో నగరానికి చెందిన జెన్నీఫర్ టాల్ బోటో ఫిలిపెన్స్ రాజధాని మనీలా నుంచి ఆమె దేశానికి బయలుదేరింది. మనీలా అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న జెన్నీఫర్ టాల్ బోటో బ్యాగ్ లను అధికారులు పరిశీలించారు.

జెన్నీఫర్ చేతిలో వైర్ తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ ను అధికారులు పరిశీలించారు. హ్యాండ్ బ్యాగ్ లో ఓ చిన్నారి ఉన్న విషయం అధికారులు గుర్తించారు. తనతో పాటు చిన్నారిని అమెరికా తీసుకెళ్లుతున్నానని జెన్నీఫర్ టాల్ బోటో ముందుగా అధికారులకు ఎలాంటి సమాచారం, సంబంధిత పత్రాలు ఇవ్వలేదు.

USA woman was charged with trafficking in Philippine airport

అధికారులకు అనుమానం వచ్చి పదేపదే జెన్నీఫర్ ను ప్రశ్నించగా తాను చిన్నారికి ఆంటీ అవుతానని, ఆమె తల్లి తనకు బిడ్డను ఇచ్చిందని సమాధానం ఇచ్చింది. చిన్నారిని తీసుకెళ్లడానికి ఆమె తల్లి ఇచ్చిందని చూపించిన లెటర్ లో ఎలాంటి సంతకం లేకపోవడంతో అధికారులకు మరింత అనుమానం వచ్చింది.

అక్రమంగా చిన్నారులను విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ జెన్నీఫర్, చిన్నారి తల్లి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని, జెన్నీఫర్ ఇంకా ఎంత మంది చిన్నారులను ఇలా విదేశాలకు అక్రమంగా తరలించింది అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+