టెక్కీలకుషాక్:హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ 6 నెలల పాటు రద్దు,భారత్ లక్ష్యంగానే?

హెచ్ 1 బీ వీసాలపై ఆరుమాసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.స్థానికులకు ఉద్యోగాలు కల్పించే దిశగా అమెరికా చర్యలను చేపట్టింది.అమెరికా తీసుకొంటున్న నిర్ణయాల

వాషింగ్టన్:హెచ్ 1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ఈ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను ఆరు మాసాల పాటు

తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ సిటిజన్ షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీ ఐఎస్ ) ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.ట్రావెల్ బ్యాన్ పేరుతో ఏడు ముస్లిం దేశాల నుండి రాకపోకలపై నిషేధం విధిండంతో విమర్శలను ఎదుర్కొన్నారు.

ట్రంప్ తీసుకొనే నిర్ణయాలన్నీ కూడ వివాదాస్పంగా మారుతున్నాయి. అయితే విమర్శలు తీవ్రంగా కావడంతో తన నిర్ణయాలను పున:సమీక్షించుకొంటున్నాడు.

స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తామని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంశంలో ప్రకటించారు.ఈ దిశగా ఆయన చర్యలను చేపట్టారు.అయితే ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా ఐటి దిగ్గజ కంపెనీలు కూడ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.

హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు

హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు

ఈ ఏడాది ఏప్రిల్ 3వ, తేది నుండి హెచ్ 1 బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను ఆరు మాసాల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది.

2018 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ హెచ్ 1 బీ వీసాల ధరఖాస్తును కూడ ఏప్రిల్ 3 నుండి స్వీకరించనున్నట్టు ప్రకటించింది.

ప్రాసెసెంగ్ సమయం తగ్గించేందుకేనా?

ప్రాసెసెంగ్ సమయం తగ్గించేందుకేనా?

ప్రత్యేక ఫీజుతో (1,225 డాలర్లు) చెల్లిస్తే హెచ్ 1 బీ వీసాల ఆమోద ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకొనేందుకు వీలు కల్పించేలా ప్రీమియం ప్రాసెసింగ్ తాత్కాలిక రద్దు ప్రీమియం ప్రాసెసింగ్ కు మాత్రమే వర్తిస్తోందని దీని వల్ల సాధారణ హెచ్ 1 బీ వీసాల ప్రాసెసింగ్ సమయం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా వివరించింది.

ప్రస్తుతం ప్రీమియం ప్రాసెసింగ్ 15 పనిదినాల్లో పూర్తి కానుండగా, సాధారణ హెచ్ 1 బీ వీసాల ప్రాసెసింగ్ కు మూడు నుండి ఆరు మాసాల సమయం పడుతోంది.

సిలీకాన్ వ్యాలీ కంపెనీలకు ఇబ్బందేనా?

సిలీకాన్ వ్యాలీ కంపెనీలకు ఇబ్బందేనా?

అమెరికాలో ఉద్యోగానికి నిపుణులకిచ్చే ఈ తాత్కాలిక వర్క్ వీసీ (హెచ్ 1 బీ) ఎక్కువగా భారత ఐటీ ఇంజనీర్లు, వారికి ఉద్యోగాలిస్తున్న కంపెనీలు ఉపయోగించుకొంటున్నాయి.


అమెరికా ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం కారణంగా ఇప్పటికే హెచ్ 1 బీ వీసాల కోసం ధరఖాస్తు చేసుకొన్న పలు కంపెనీలకు పెండింగ్ లోని తమ ధరఖాస్తులను క్లియర్ చేసుకొనేందుకు అవకాశం ఏర్పడుతోంది.

భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఎక్కువగా ఉద్యోగాలిచ్చే సిలికాన్ వ్యాలీ కంపెనీలు మాత్రం తాజా నిర్ణయంతో తమ ధరఖాస్తులు ఆమోదం పొందేందుకు మరింత సమయం వేచి చూడక తప్పదు.

మరో వివాదాస్పద బిల్లు, భారత్ టార్గెట్?

మరో వివాదాస్పద బిల్లు, భారత్ టార్గెట్?


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా అమెరికా కాంగ్రెస్ మరో వివాదాస్పద బిల్లును ముందుకు తెచ్చింది. శనివారం నాడు సభలో హెచ్ 1 బీ వీసా, ఎల్ 1 వీసాల సంస్కరణ బిల్లు 2017 ను ప్రవేశపెట్టారు.

నలుగురు అమెరికన్ చట్ట సభ్యుల బైపార్టిషన్ గ్రూపు ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే యూఎస్ లో నైపుణ్యం వల్ల ఉద్యోగాల్లో ఎక్కువగా ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పవు.

హెచ్ 1 బీ వీసా, ఎల్ 1 వీసాలో చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని వీటీని సంస్కరణలను ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును ప్రవేశపెట్టామని బైపార్టిషన్ బృందం
వెల్లడించింది. ఇప్పటికే యూఎస్ కాంగ్రెస్ ముందుకుఇదే లక్ష్యంతో రూపొందించిన పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిందే

స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిందే

యూఎస్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన ఈ వీసాల సంస్కరణ బిల్లు ఆమోదం పొంది అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తే అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులకు బదులుగా స్థానికులను చేర్చుకొనేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

తప్పనిసరైతే అదీ తక్కువ సంఖ్యలో విదేశీయులకు (హెచ్ 1బీ, ఎల్ 1 వీసా) అవకాశమివ్వాలి.హెచ్ 1 బీ , ఎల్ 1 వీసాలు పొందిన ఉద్యోగులకు స్థానికుల స్థానాలను భర్తీ చేయడం ద్వారా పూర్తిగా నిషేధం.హెచ్ 1బీ, ఎల్ 1 వీసా ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. అమెరికా ఉద్యోగులను కాపాడడంలో ఈ కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. హెచ్ 1 బీ వీసాల్లోని లొసుగులను దుర్వినియోగం చేస్తున్నందునే సంస్కరణలను ప్రతిపాదించినట్టుగా అమెరికా చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+