గ్రీన్ కార్డు, వీసా రూల్స్ పై అమెరికా కోర్టు సంచలన తీర్పు..! భారత్ కు గుడ్ న్యూస్..?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA)లో భాగంగా పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా సరిహద్దులను పూర్తిగా నియంత్రించడంపై దృష్టి సారించారు. చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వలవవాదలను తమ స్వదేశాలకు పంపించారు. అలాగే జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన 39 దేశాల పౌరులపై కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించారు. వారికి వీసాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించారు.
అమెరికా అంతర్గత పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ, దేశీయ కంపెనీలకు భారీగా పన్ను రాయితీలు కల్పించే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ట్రంప్ తీసుకున్న దుందుడుకు నిర్ణయాలతో అమెరికా కోర్టులలో చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్ పరిపాలన యంత్రాంగం గ్రీన్ కార్డులు, వీసాలపై విధించిన కొన్ని వివాదాస్పద ప రిమితులను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.
గతంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కాల్పుల ఘటనను ఉటంకిస్తూ.. ట్రంప్ ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, గల్ఫ్ ప్రాంతాలకు చెందిన 39 దేశాల పౌరులపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఆయా దేశాల వలసదారుల గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్ లు, ఆశ్రయం, పౌరసత్వ దరఖాస్తుల తుది నిర్ణయాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం నిరవధికంగా నిలిపివేసింది. ఈ మేరకు రోడ్ ఐలాండ్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జ్ జాన్ మెక్ కానెల్ ఈ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతూ కొట్టివేశారు.
వలసవాదుల రూల్స్ ప్రకారం.. దరఖాస్తు చేసుకుని.. ఫీజులు చెల్లించి.. ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ.. కేవలం వారు జన్మించిన దేశం కారణంగా వివక్ష చూపించడం చట్ట విరుద్ధమని, ఇది వలసవాదుల జీవితాలను తీవ్రమైన అనిశ్చితిలోకి నెట్టివేసిందని జడ్జి పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం భారత్ కు గుడ్ న్యూస్ గా భావించవచ్చు.

ఈ 39 దేశాల్లో భారత్ లేనప్పటికీ వివక్ష పూరిత విధానాలకు ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేయడంతో గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్ లో దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షలాదిమంది భారతీయులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఉంటూ చట్టబద్దంగా గ్రీన్ కార్డు కోసం అడ్జస్ట్ మెంట్ ఆఫ్ స్టేటస్ దరఖాస్తు చేసుకునేవారి హక్కులను ఈ తీర్పు సమర్థించింది. అలాగే వీసా రూల్స్ ను కఠినతరం చేస్తూ స్వదేశానికి వెళ్లి గ్రీన్ కార్డు తెచ్చుకోవాలనుకునే తరహా ప్రతిపాదనలకు ఈ తీర్పు బ్రేక్ వేసినట్లుగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications