విషాదం: బొమ్మ తుపాకీతో బెదిరించిన నటి.. పోలీసులు కాల్చి చంపేశారు

Recommended Video

    ప్రముఖ హాలీవుడ్ నటి దుర్మరణం

    లాస్ఏంజెల్స్: అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో విషాద ఘటన చోట చేసుకుంది. టిలివిజన్ సిరీస్ 'ఈఆర్'తో మంచి పేరు సంపాదించుకున్న హాలీవుడ్ నటి వెనెస్సా మార్క్వెజ్ పోలీసులను బెదిరించబోయి ప్రాణాలు కోల్పోయింది.

    బొమ్మ తుపాకీతో బెదిరింపు.. కాల్చేశారు

    బొమ్మ తుపాకీతో బెదిరింపు.. కాల్చేశారు

    లాస్ఏంజెల్స్‌లోని ఆమె నివాసానికి తనిఖీ నిమిత్తం వచ్చిన పోలీసులపైకి వెనెస్సా బొమ్మ తుపాకీని చూపిస్తూ బెదిరించాలనుకుంది. అయితే, అది నిజమైన తుపాకీగా భావించిన పోలీసులు.. ఆమెను కాల్చి చంపేశారు. ఈ మేరకు వివరాలను లాస్ఏంజెల్స్ పోలీసు ఉన్నతాధికారి సెర్గాంట్ జోయ్ మెండోజా వెల్లడించారు.

    మద్యం మత్తులో నటి

    మద్యం మత్తులో నటి

    వెనెస్సా మార్క్వెజ్ ఇంటి యజమానే ఆమె నివాసాన్ని తనిఖీ చేయాలని పోలీసులకు సమాచారం ఇచ్చాడని మెండోజా తెలిపారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆమె ఒక రకమైన మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని చెప్పారు. గంటకు పైగా ఆమె నివాసంలో తనిఖీలు చేపట్టామని, ఆ సమయంలో ఆమెకు చికిత్స అందజేయడానికి కూడా ప్రయత్నించినట్లు తెలిపారు.

    బొమ్మ తుపాకీతో బెదిరించడంతో..

    బొమ్మ తుపాకీతో బెదిరించడంతో..

    అయితే, అదే సమయానికి వెనెస్సా మార్క్వెజ్ తన చేతిలోకి ఓ తుపాకీ తీసుకొని పోలీసుల వైపు ఎక్కుపెట్టిందని.. దీంతో అక్కడే ఉన్న ఓ అధికారి ఆమెపై కాల్పులు జరిపాడని సెర్గాంట్ తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

    ఈఆర్‌తో మంచి గుర్తింపు పొందిన వెనెస్సా..

    ఈఆర్‌తో మంచి గుర్తింపు పొందిన వెనెస్సా..

    1994-1997 వరకు ప్రసారమైన ‘ఈఆర్' టెలివిజన్ సిరీస్‌లో నర్సు పాత్రలో నటించారు వెనెస్సా మార్క్వెజ్. ‘సెయిన్ ఫెల్డ్', మెల్‌రోస్ ప్లేస్ వంటి షోలతోనూ ఆమె ఆకట్టుకున్నారు. గత సంవత్సరం లైంగిక వేధింపులు, జాతి వివక్షపై టీవీ షోలో మాట్లాడినందుకు ఆమెను ఆ కార్యక్రమం నుంచి తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఆమె సహనటుడు జార్జ్ కూన్లీనే అనే వార్తలు వినిపించాయి. అయితే ఆమెను తీసేసెంత అధికారం తన వద్ద లేవని, తాను కేవలం నటుడిని మాత్రమేనని కూన్లీ వివరణ ఇ,చ్చుకున్నాడు కూడా. కాగా, వెనెస్సాను అనవసరంగా చంపేశారంటూ ఆమె అభిమానులు, స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+