ట్రంప్ కుటుంబంలో కలకలం! విడిపోతున్న జూనియర్ దంపతులు, 12 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ పెద్ద సమస్య వచ్చిపడింది. అది... ఆయన పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, కోడలు వనెస్సాల విడాకుల వ్యవహారం. ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరించే ట్రంప్ ఇప్పుడు తన కుటుంబంలో తలెత్తిన ఈ చిన్న సమస్యను పరిష్కరించుకోలేక పోతున్నారు.

ఇప్పటికే పలువురు మహిళలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తమకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటూ ఆయనపై రాళ్లు విసరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ పోర్న్‌స్టార్ వ్యవహారం ట్రంప్‌ను పెద్ద ఇరకాటంలోనే పడేసింది. ఇప్పుడేమో ఏకంగా ఆయన కుటుంబంలోనే విడాకుల పర్వం!

కోర్టుకెక్కిన ట్రంప్ కోడలు...

కోర్టుకెక్కిన ట్రంప్ కోడలు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దకొడుకు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ భార్య వనెస్సా హేడన్ ట్రంప్.. తనకు తక్షణమే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ గురువారం మన్‌హట్టన్‌లోని కోర్టును ఆశ్రయించారు. జూనియర్‌ ట్రంప్‌ అసలు కుటుంబానికి సమయం కేటాయించడం లేదని ఆమె ఆరోపించారు. పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల పరిష్కారం కంటే ముందే తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఓ కోర్టులో వనెస్సా పిటిషన్‌ దాఖలు చేశారు.

పేరు మోసిన బిజినెస్ మాన్...

పేరు మోసిన బిజినెస్ మాన్...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్‌కు జన్మించిన తొలి సంతానమే డొనాల్డ్ ట్రంప్ జూనియర్. ఇతడు కూడా తండ్రి లాగే అమెరికాలో పేరు మోసిన బిజినెస్ మాన్. టెలివిజన్ రంగంలో రాణించిన ట్రంప్ జూనియర్ తన తండ్రి అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన రియాల్టీ వ్యాపారాన్ని కూడా చూస్తున్నారు. ఇటీవలే భారత్ సందర్శంచి వెళ్లారు. భారత్‌లోని పలు నగరాల్లో కూడా ట్రంప్‌కు సంబంధించిన రియాల్టీ వెంచర్ల నిర్మాణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 12 ఏళ్ల బంధానికి ముగింపు?

12 ఏళ్ల బంధానికి ముగింపు?

డొనాల్డ్ ట్రంప్ జూనియర్ 2005లో మోడల్ అయిన వనెస్సా హేడన్‌ను పెళ్లాడారు. వీరికి ఐదుగురు పిల్లలు. ట్రంప్ ఆర్గనైజేషన్స్‌లో ఎగ్జిక్యూటివ్ అయిన జూనియర్ ట్రంప్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తమకు వివాహమై 12 ఏళ్లు గడిచాయని, ఇప్పుడు తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. తాము విడిపోయినా ఒకరిని ఒకరం గౌరవించుకుంటామని తెలిపారు. తమకు ఐదుగురు అందమైన పిల్లలు ఉన్నారని, వారికి తామిచ్చే ప్రాధాన్యం ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొన్నారు.

వనెస్సా అసంతృప్తికి అదే కారణమా?

వనెస్సా అసంతృప్తికి అదే కారణమా?

డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన పిల్లలైన ట్రంప్ జూనియర్, అతడి తమ్ముడు ట్రంప్ ఎరిక్‌లే పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్‌ ట్రంప్‌ తన కుటుంబానికంటే వ్యాపారానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, బహుశా ట్రంప్ జూనియర్ భార్య వనెస్సా అసంతృప్తికి అదే కారణమై ఉంటుందని అమెరికన్‌ మీడియా పేర్కొంది. కాగా, కొడుకు-కోడలి మధ్య తలెత్తిన విభేదాలు, వారి విడాకుల దరఖాస్తుపై ట్రంప్‌ కుటుంబం ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అసలే చస్తుంటే... మళ్లీ ఇదొకటా?

అసలే చస్తుంటే... మళ్లీ ఇదొకటా?

ఒకవైపు సమస్యల వలయంలో ట్రంప్ కొట్టుమిట్టాడుతుంటే ఇప్పుడు కొడుకు-కోడలు విడాకుల వ్యవహారం ఆయనకు మరింత చికాకు కలిగించే అంశమే. పైగా అధ్యక్షుడు ట్రంప్‌కు.. రష్యాకు మధ్య ఉన్న సంబంధాలపై ఇప్పటికే ప్రత్యేక న్యాయవాదుల బృందం దర్యాప్తు కూడా ప్రారంభించింది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జూనియర్ ట్రంప్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2016లో ట్రంప్ టవర్‌లో జరిగిన సమావేశంలో రష్యా లాయర్, ట్రంప్ ప్రచార ముఖ్యులు పాల్గొన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన హిల్లరీ క్లింటన్‌పై బురద జల్లాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్టు జూనియర్ ట్రంప్ ఈ-మెయిల్స్ ద్వారా కూడా వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+