2014 సంవత్సరానికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొత్త పదం 'వేప్'
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం కొన్ని వేల పదాలు ఇంగ్లీషు భాషలో ఇముడ్చుకుంటున్న విషయం తెలిసిందే. వాటి నుంచి ఓ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఆ సంవత్సర పదంగా ఎంపిక చేస్తుంది.
2014 సంవత్సరానికి గాను సంబంధించి కొత్త పదాలలో విశిష్టమైన పదంగా "వేప్" vape ను ఎంపిక చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సంస్ధ ప్రకటించింది. గత ఏడాది 'సెల్ఫీ' అనే పదాన్ని ఎంపిక చేశారు.

ఇప్పుడా 'సెల్ఫీ' అనే పదం ఎంతలా వాడుకలోకి వచ్చిందో తెలిసిందే. ప్రతి ఒక్కరూ వారి సెల్ఫీలను తీసుకోని సోషల్ మీడియా వెబ్ సైట్స్‌లో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. వేప్ అంటే, ఈ-సిగరెట్‌ను పీల్చే విధానమని తెలిపింది.












Click it and Unblock the Notifications