కంగ్రాట్స్ బిడెన్: విష్ చేసిన పొప్ ఫ్రాన్సిస్.. ఆశీస్సులతో లేఖ, థాంక్స్ చెప్పిన కొత్త అధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయఢంకా మోగించారు. ఆయన విజయాన్ని ప్రపంచం అంగీకరించింది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒప్పుకోలేదు. ఓట్ల లెక్కింపుపై కొన్ని చోట్ల న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు రొమన్ క్యాథలిక్ పొప్ ఫ్రాన్సిస్ మాత్రం ధృవీకరించారు.

Recommended Video

    US Election 2020: A victory for “we the people” - Joe Biden | Oneindia Telugu

    అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫ్రాన్సిస్ కృతజ్ఞతలు తెలిపారని బిడెన్ పేర్కొన్నారు. కంగ్రాట్స్ చెప్పడంతోపాటు ఆశీస్సులు కూడా అందజేశారని తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని పోప్ ఆకాంక్షించారని వెల్లడించారు. శాంతితోపాటు సమరస్యం పెంపొందించేందుకు పాటుపడాలని కోరారని తెలిపారు. వాతావరణ మార్పులు, పేదరికం, వలసలపై పొప్‌తో కలిసి తాను పనిచేస్తానని బిడెన్ తెలిపారు.

    Vatican calling: Pope congratulates Joe Biden on election

    అమెరికాలోని కొందరు బిషప్ మాత్రం బిడెన్ విజయాన్ని గుర్తించలేదు. గర్భస్రావ హక్కులకు మద్దతు ఇస్తున్నందున బిడెన్‌కు సపోర్ట్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. గర్భదారణ సమయంలో అమాయకులను చంపడానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యరిస్ మద్దతు ఇస్తున్నారని బిషప్ జోసెఫ్ తెలిపారు. గర్భస్రావానికి సంబంధించి చర్చి సిద్దాంతానికి వ్యక్తిగతంగా అంగీకరిస్తానని బిడెన్ తెలిపారు. అయితే దానిని ఇతరులపై రుద్దడం తనకు ఇష్టం లేదన్నారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బిడెన్‌ ప్రపంచ దేశాధినేతలు అభినందిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యెల్ మాక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెల్ ఇప్పటికే విష్ చేశారు. ఇప్పుడు పోప్ అభినందనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ కాథలిక్. ఇదివకు జాన్ ఎఫ్ కెన్నెడీ ఉండేవారు. తన విశ్వాసం గురించి బహిరంగంగా మాట్లాడేవారు. ప్రతీ వారం డెలావేర్‌లో గల విల్మింగ్టన్‌లో తన ఇంటి సమీపంలో జరిగే మాస్‌కు హాజరవుతారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+