• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

33 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం: 80 మందికిపైగా గాయలు(వీడియో)

|

సియోల్: దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉల్సాన్ నగరంలోని 33 అంతస్తుల అపార్ట్ మెంట్‌లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం.

అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తులో చెలరేగిన మంటలు 8వ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే భారీ ఎత్తున అగ్నిమాపక దళాలు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. అప్పటికే ఆ భవనంలో మంటలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

Video: Massive fire engulfs 33-storeyed building in South Korea

కాగా, గాలులు బలంగా వీస్తుండటంతో మంటలో ఇతర అంతస్తులకు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 88 మంది హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాద ఘటనలో ఎంత మంది మరణించారు? ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా, కోటి పది లక్షల జనాభా గల ఉల్సాన్ నగరంలో గత ఏప్రిల్‌లో ఇలాగే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 38 మంది మరణించారు. 50 మందికిపైగా గాయాలపాలయ్యారు.

English summary
Watch: Massive fire engulfs 33-storeyed building in South Korea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X