భార్యతో కలిసి ముషారఫ్ డ్యాన్స్, వైరల్ (వీడియో)
లాహోర్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇది బాగా చక్కర్లు కొడుతోంది. ఓ ప్రయివేటు కార్యక్రమంలో తన భార్యతో కలిసి ముషారఫ్ డ్యాన్స్ చేశాడు.
సమాచారం మేరకు ఈ వీడియో.. ముషారఫ్ బంధువులకు సంబంధించిన ఓ పెళ్లి కార్యక్రమంలో డ్యాన్స్ చేశాడని తెలుస్తోంది. ముషారఫ్ వయస్సు 73. అతను ఇటీవలే బ్యాక్ బోన్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లాడు.
ఆయన డ్యాన్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. బ్యాక్ బోన్ నొప్పికి ముషారఫ్ కొత్త ట్రీట్మెంట్ కనుగొన్నాడని సెటైర్లు వేస్తున్నారు. ముషారఫ్ గోదుమ రంగు కమీజ్, తెల్లటి సల్వాల్ వేసుకున్నాడు. 'షకర్ వందన్ రే' అనే ఫేమస్ పాటకు భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు.












Click it and Unblock the Notifications