వీడియో: వారు ఏడు పులులతో కలిసి జీవిస్తున్నారు

బ్రెజిల్: బ్రెజిల్‌లోని మరింగాకు చెందిన ఓ కుటుంబం తమ ఇంటిని ఏడు పులులతో పంచుకుంటోంది. పులులను వారు పెంచుకుంటున్నారు. రెండేళ్ల క్రితం సర్కస్‌లో అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న రెండు పులులను కుటుంబ పెద్ద ఆర్యాస్ బోర్జెస్ ఇంటికి తీసుకుని వచ్చాడు. పులులను మచ్చిక చేసుకుని, వాటితో ప్రవర్తించే తీరుపై అతనికి అప్పుడు ఏ విధమైన అనుభవం లేదు.

బోర్జెస్‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారు డెయుసానిరా (24), ఉయారా (23), న్యారా (20). వారు ఆహారాన్ని, పడకను పులులతో పంచుకుంటారు. తీరిక వేళల్లో వాటితో గడుపుతారు. తన కూతుళ్లు పులులతో జీవించడంపై బోర్జెస్ ఏ విధమైన ఆందోళన చెందలేదు.

Video: This Brazilian family lives happily with 7 tigers!

జంతువుల పట్ల గౌరవం, ప్రేమ చూపాలని, ప్రతిగా అవి అదే విధంగా వ్యవహరిస్తాయని బోర్జెస్ కూతుళ్లకు చెప్పాడు. ఇద్దరు చిన్న కూతుళ్లు వాటికి ఆహారం పెడుతారు, వాటితో పాటు ఈత కొడుతారు. దాంతో వారికి పాటితో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.

అయితే, పులుల పట్ల కుటుంబంలో పూర్తి సంతృప్తి లేదు. తన భార్య, పులికి మధ్య అనుబంధం తనకు ఇష్టం లేదని ఉయారా భర్త రాఫెల్ అన్నాడు. తన చిన్న కూతురిని పులులకు సన్నిహితంగా తీసుకుని వెళ్లడం కూడా తనకు ఇష్టం లేదని ఆయన అన్నాడు. తన కూతురు తనలా, వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/xwidefc2wpc?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

పులుల కోసం మరింగాలో 40 ఏకరాల ఎకో పార్కును ఏర్పాటు చేయాలని బోర్జెస్ అనుకుంటున్నాడు. దానివల్ల పులులకు తిరగడానికి విశాలమైన ప్రదేశం ఉంటుందని ఆయన భావిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+