లింబో అద్భుతం: ఎయిర్ పోర్ట్‌లో సీటు కింద నుంచి ఈ యువతి ఏం చేసిందంటే?
ఫిలడెల్ఫియా: సాధారణంగా ఎవరైనా విమానాశ్రయంలో వేచి చూసే పరిస్థితులు వస్తే ఏం చేస్తారు? పుస్తకాలు చదువుతారు, నెట్లో తమకు ఇష్టమైన వాటిని చూస్తుంటారు లేదంటే అక్కడ కలియ తిరుగుతారు. కానీ ఫిలడెల్ఫియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (పీహెచ్ఎల్) మాత్రం ఓ మహిళ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇంటర్నెట్లో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆమె విమానాశ్రయంలో డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, విమానానాశ్రయంలో కూర్చోవడానికి ఉన్న సీట్ల కింద నుంచి డ్యాన్స్ చేస్తూ అందర్నీ అలరించింది.

లక్షలాది మంది చూస్తున్నారు
ఆమె పేరు షెమికా క్యాంప్‌బెల్. వయస్సు 24. అందరు చూస్తుండగానే విమానాశ్రయంలో ఆమె ఈ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను లక్షలాది మంది చూస్తున్నారు. యూట్యూబ్‌లోను అలరిస్తోంది.

సంప్రదాయ డ్యాన్స్ నేర్చుకుంది
ఈమె ట్రినిడాడ్ అండ్ టుబాగోకు చెందినది. దీంతో ఆ యువతి ఈ డ్యాన్స్‌ను వారి తల్లి, అమ్మమ్మల నుంచి నేర్చుకుంది. షెమికా క్యాంప్‌బెల్ ఇప్పుడు న్యూయార్క్‌లోని బఫలోలో నివసిస్తోంది. ఇక్కడ నివసిస్తున్నప్పటికీ తన సంప్రదాయ డ్యాన్సును నేర్చుకుంది.

గిన్నిస్ రికార్డ్ హోల్డర్
తన ప్రతిభతో ఆమె రెండుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆమె 2010లో తొలిసారి 'లోయెస్ట్ ఫిమేల్ లింబో'తో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పుడు ఆమె భూమి నుంచి 8.5 ఇంచుల ఎత్తులో డ్యాన్స్ చేసింది. 2016లో రెండో రికార్డ్ సృష్టించింది. 'ది లాంగెస్ట్ డిస్టెన్స్ టు లింబో అండర్ 12 ఇంచెస్'... భూమి నుంచి 12 ఇంచుల ఎత్తులో అత్యధిక దూరం డ్యాన్స్ చేసి రికార్డ్ సృష్టించింది. ఆమె పది అడుగుల దూరం దీనిని ప్రదర్శించింది.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications