భర్త చితగ్గొడుతుంటే.. వృషణాలను గట్టిగా నొక్కడంతో..

Subscribe to Oneindia Telugu

వియత్నాం : నిర్లక్ష్యమో.. లేక గాఢ నిద్రో.. భర్త గట్టిగా తలుపులు బాదినా భార్య తలుపు తీయలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త భార్యపై తన ప్రతాపం చూపించాడు. ఇష్టం వచ్చినట్టు చితకబాదడం మొదలుపెట్టాడు. ఆత్మరక్షణలో భాగంగా అతడి దాడిని ఎలా అడ్డుకోవాలో తెలియని భార్య అతడి వృషణాలను గట్టిగా అదిమిపట్టుకుంది. దీంతో దాడికే కాదు.. అతగాడి జీవితానికే ఫుల్ స్టాప్ పడింది.

వియత్నాంలోని దక్షిణ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. భర్త లీ కిమ్ ఖాయ్ (53) ఏదో పని మీద బయటకెళ్లి వచ్చి ఇంటి తలుపు తట్టాడు. అయితే ఇంట్లో ఉన్న భార్య పాన్ థీ కిమ్ (55), కూతుళ్లు ఎంతకీ తలుపు తీయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

Vietnamese wife kills her husband by crushing his testicles for five minutes after he started to beat her

ఇదే క్రమంలో భార్య పాన్ థీ కిమ్ తలుపు తెరవడమే ఆలస్యం ఆమెపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డాడు లీ కిమ్. దీంతో దాడిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆత్మరక్షణ కోసం అతడి వృషణాలను పట్టుకుంది పాన్ థీ కిమ్. భర్తను కిందపడేసి అతడి పొట్టపై కూర్చొని వృషణాలను గట్టిగా నొక్కి పట్టుకుంది. ఆ సమయంలో భర్త లీ కిమ్ వాంతులు చేసుకున్నా.. అదేమి పట్టించుకోలేదు.

కాగా, ఇంతలో విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు పరుగెత్తుకుంటూ ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య నుంచి భర్త లీ కిమ్ ను విడిపించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే లీ కిమ్ ప్రాణాలు వదిలినట్టుగా నిర్దారించారు వైద్యులు.

ఇదిలా ఉంటే, ఘటనపై స్పందించిన సదరు భార్య పాన్ థీ కిమ్.. తన భర్త లీ కిమ్ తనపై తరచూ దాడి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. దాడి నుంచే తప్పించుకునే ప్రయత్నంలో అతడిని హెచ్చరించేందుకే వృషణాలను పట్టుకున్నానని, ఇంత ఘోరం జరుగుతందనుకోలేదని వాపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Le Kim Khai, 53, died of suffocation en route to hospital on Sunday after his face turned purple. His wife, 55-year-old Phan Thi Kim Chuong, is being held for questioning, Tien Giang police said on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి