షాక్ :యువకుడిపై పోలీసుల అత్యాచారం,తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఇలా..

ఫ్రాన్స్ లో ఓ యువకుడిపై పోలీసలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు..ప్రజల నిరసనలను నివారించేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీ

పారిస్:ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజల ప్రాణాలను హరించే చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఉన్మాదానికి నిరసనగా ఫ్రాన్స్ లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.22 ఏళ్ళ యువకుడిపై పోలీసులు అత్యాచారం చేశారనే ఆరోపణలపై ప్రజలు పోలీసులను తీరును ఎండగడుతున్నారు.అంతేకాదు పోలీసుల తీరును నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.ఈ ఘటన ప్రాన్స్ లో చోటుచేసుకొంది.

22 ఏళ్ళ యువకుడిపై పోలీసులే అత్యాచారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలనుద నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

పోలీసుల తీరును నిరసిస్తూ సుమారు రెండువేల మంది బోబిగ్నిలో నిరసన ర్యాలీలు నిర్వహించారు.ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్ళు విసిరారు.

 Violent clashes over alleged rape by French police

ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు పోలీసులు. మార్పిల్లీలోనూ పోలీసుల చర్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

టౌలౌస్,ఓర్లీన్స్ లోనూ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని ప్రసారమాధ్యమాలు వెల్లడిస్తున్నాయి. యువకుడిపై అత్యాచారం జరిపారనే ఘటనపై ఓ పోలీసుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

అత్యాచారానికి గురైన 22 ఏళ్ళ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడని నిరసనకారులు చెబుతున్నారు.ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వారు చెబుతున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రజల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+