ఆపిల్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన, లేట్ బోనస్ చెల్లింపుపై స్ట్రైక్, ఎక్కడ అంటే..?
చైనాలో ఆపిల్ ఐఫోన్ సప్లయర్ ఫాక్సాన్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన నెలకొంది. కరోనా లాక్ డౌన్ సమయంలో లేట్ బోనస్ చెల్లింపులపై కార్మికులు నిరసనకు దిగారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. సెంట్రల్ చైనాలో గల జెంగ్జౌ వద్ద గల ఫాక్స్కాన్ ఐ ఫోన్ ఫ్యాక్టరీలో నిరసనలు జరిగాయి.
ఇప్పుడు కూడా చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదీ హాలీడే షాపింగ్ సీజన్‌కు ముందు ఆఫిల్ సప్లై మరింత ఆటంకం కలిగించనుంది. కఠినమైన కోవిడ్ లాక్ డౌన్‌లో కార్మికులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారికి బోనస్ చెల్లింపు ఆలస్యం జరుగుతుందని తెలిసింది. దీంతో నిరసనలు ప్రారంభమై ఉంటుంది. దీనికి సంబంధించి ఫాక్స్కాన్ కూడా అధికారిక ప్రకటన చేసింది. ఫ్యాక్టరీలో నిరసనలు, హింస చెలరేగిందని వివరించింది.

హింస జరగడంతో.. ఇలాంటి ఘటన రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియాలో వందలాది మంది కార్మికులు కనిపించారు. రోడ్డుపై నడుస్తూ పోలీసులపైకి కర్రలు, ఇటుకలు విసిరినట్టు కనిపించాయి.
రిటెన్షన్ అలొవెన్స్ మార్చారని ఓ కార్మికుడు తెలిపారు. ఫిబ్రవరి 2023 వరకు కంపెనీలో ఉండే ఉద్యోగులకు సంబంధించి మాట ఇచ్చారని.. దానిని ఇప్పుడు తప్పారని చెబుతున్నారు. అయితే కార్మికులు తమకు బోనస్ రావాలంటే మాత్రం మార్చి 15వ తేదీ వరకు ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు వెళ్లిపోవడానికి కంపెనీకి ఎలాంటి అభ్యంతరం లేదు.












Click it and Unblock the Notifications