వైరల్ : 5లక్షలకు థర్మాకోల్ కేక్...! వెడ్డింగ్ ప్లానర్స్ నిర్వాకం

మనీలా : మనీలాలో వింత ఘటన చోటు చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లిరోజును ఘనంగా జరుపుకోవాలనుకున్న ఓ జంటకు చేదు అనుభవం మిగిలింది. వెడ్డింగ్ ప్లానర్స్ హ్యాండివ్వడంతో అతిథుల దగ్గర పరువు పోయింది. దీంతో డబ్బు పాయే.. పరువు పాయే అంటూ నిట్టూర్చారు ఆ దంపతులు.

హ్యాండిచ్చిన క్యాటరింగ్.. పెళ్లిరోజు నాడు నిరాశ

హ్యాండిచ్చిన క్యాటరింగ్.. పెళ్లిరోజు నాడు నిరాశ

పెళ్లిరోజును ఘనంగా జరుపుకోవాలని కలలు కన్న జంటకు నిరాశే మిగిలింది. నెల రోజుల ముందు నుంచి చేసుకున్న ప్లాన్ చివరకు ఫెయిలయింది. బంధుమిత్రులకు ఆహ్వానాలు పంపారు. వచ్చినవారిని సంతోషపరిచేలా ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. విందు కోసం వెడ్డింగ్ ప్లానర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. చివరకు పెళ్లి రోజు రానే వచ్చింది. అతిథులంతా వచ్చేశారు. కానీ వెడ్డింగ్ ప్లానర్స్ ప్రతినిధులు పత్తాలేకుండా పోయారు. విందు సమయం ముంచుకొస్తున్నా వారి జాడలేకపోవడంతో అతిథుల ముందు నవ్వులపాలయ్యింది ఆ జంట.

విందు విఫలం.. అతిథుల ముందు అవమానం

విందు విఫలం.. అతిథుల ముందు అవమానం

ఫిలిప్పైన్స్ దేశంలోని పాసిగ్ సిటీలో నివాసముండే షైన్ తమయో, జాన్ చెన్ దంపతులు తమ వెడ్డింగ్ యానివర్సరీని అందంగా ప్లాన్ చేసుకున్నారు. వేడుకలు అదిరిపోయేలా జరగాలని కలలు కన్నారు. దాంతో స్థానికంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వెడ్డింగ్ ప్లానర్స్ ను ఆశ్రయించారు. పెళ్లిరోజు వేడుకలకు సంబంధించి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేయించారు. మొత్తానికి ఓ 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి ఆర్డర్ కన్ఫామ్ చేశారు. తీరా పెళ్లిరోజు దగ్గరకొచ్చాక సదరు సంస్థ ప్రతినిధులు హ్యాండిచ్చారు. వీరి ఆహ్వానం మేరకు అతిథులంతా వచ్చినా.. వెడ్డింగ్ ప్లానర్స్ వాళ్లు రాకపోవడం విస్మయానికి గురిచేసింది. మోసపోయామని తెలుసుకుని ఏమీ చేయలేక సమీపంలోని హోటళ్ల నుంచి కొన్ని వంటకాలు తెప్పించి విందు ప్రక్రియ మమ అనిపించారు.

5 లక్షలు.. థర్మాకోల్ కేక్

5 లక్షలు.. థర్మాకోల్ కేక్

విందు ఏర్పాట్లు చేయని సదరు వెడ్డింగ్ ప్లానర్స్ సంస్థ.. కేక్ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూల్ కేకుకు బదులు థర్మాకోల్ కేక్ పంపించి అవమానించింది. థర్మాకోల్ కు రంగులద్ది అచ్చం కేక్ లాగా తయారుచేసి పంపించింది. తీరా కట్ చేద్దామనేసరికి అది కేక్ కాదనే విషయం బయటపడింది. అటు విందు విషయంలో చేయివ్వడమే గాకుండా కేక్ విషయంలోనూ సదరు వెడ్డింగ్ ప్లానర్స్ సంస్థ వ్యవహరించిన తీరుకు ఆ జంట కలతచెందింది. అతిథుల ముందు తమను నవ్వులపాలు చేయడం వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి పెళ్లిరోజును సరదాగా జరుపుకుందామనుకున్న ఆ జంటకు ఈ ఉదంతం చేదు అనుభవం మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+