Viral Video:చేప కడుపులో మూత తెరవని విస్కీ బాటిల్.. షాక్‌కు గురైన ఫిషర్‌మ్యాన్

సాధారణంగా కొన్ని వీడియోలను చాలా ఆసక్తితో చూస్తాం. ఇంటర్నెట్ వచ్చాకా వీడియోలకు కొదవే లేదు. అవి ఎలాంటి వీడియోలైనా సరే... ఒక్కసారి నెట్టింట్లోకి ఎక్కిందా.. అంతే. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ అదే సమయంలో వైరల్ కూడా అవుతుంది. దీంతో వీడియో అప్‌లోడ్ చేసిన అతనికి కాసుల వర్షమే కురుస్తుంది. ఇక నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా ఓ మత్స్యకారుడి వీడియో సోషల్‌ మీడియాను చుట్టేస్తోంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం...

సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. చేపటవేటకు సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు కొన్ని చేపలను పట్టుకున్నాడు. ఇక అందులో ఓ చేపను బయటకు తీసి దాన్ని కోయడం ప్రారంభించాడు. ముందుగా ఓ భాగాన్ని చాకుతో కోసేశాడు. అనంతరం దాని పొట్ట భాగంలో ఉన్న వేస్ట్‌ను బయటకు తీస్తుండగా షాక్ అయ్యాడు. ఆ చేప పొట్టలో ఓ విస్కీ బాటిల్ ఉంది. అది కూడా కొత్త విస్కీ బాటిల్. ఇంకా సీల్‌ కూడా తెరవలేదు. ఇది చూసిన ఆ మత్స్యకారుడు ఓ పక్క షాక్‌కు గురవుతూనే మరోపక్క సంబరపడ్డాడు. తనకు జాక్‌పాట్ తగిలిందంటూ తన మిత్రులతో చెప్పడం వీడియోలో కనిపించింది. ఎందుకంటే ఆ బ్రాండ్ విస్కీకి చాలా డిమాండ్ ఉంటుందట.

A fish swallowed a unsealed whiskey bottle, video goes viral.

ఈ వీడియో ఒక్కసారిగా టిక్‌టాక్, ఇన్స్‌టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎక్కేసింది. ఇంకేముందు కొన్ని క్షణాల్లోనే వీడియో వైరల్ అయ్యింది.అయితే ఈ ఫుటేజీ నిజమా... లేక అబద్ధమా అని కనుగొనేందుకు కూడా కొందరు నెటిజెన్లు పరిశోధనలు చేయడం విశేషం. ఒకవేళ ఆ వీడియోలో కనిపించిన చేప కడుపులో ఉన్నది విస్కీ బాటిలే అయితే... అంత పెద్ద విస్కీ బాటిల్‌ను అది మింగగలదా అనే ప్రశ్న నెటిజెన్లను తొలుస్తోంది.

ఇక ఈ వీడియోపై పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు పోస్టు చేశారు. ఆ చేప గొంతు కింద విస్కీ బాటిల్ పెట్టి ఆ తర్వాత వీడియోను రికార్డు చేసి అదేదో అద్భుతం జరిగినట్లుగా చూపించే ప్రయత్నం చేశారని కొందరు పోస్టులు పెట్టారు. ఇదిలా ఉంటే అంత డిమాండ్ ఉన్న విస్కీ బాటిల్‌ను సముద్రంలోకి ఎందుకు పడేస్తారని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరైతే సముద్రంలో అనవసరమైన చెత్తను వేసి అందులో నివసించే జలచరాల ప్రాణాలను బలిగొంటున్నారని కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+