వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్లతో కాదు.. విమానంతో మహిళా పైలట్ల ప్రమాదకర కికి ఛాలెంజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెక్సికో: కొద్ది రోజుల క్రితం కికి ఛాలెంజ్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మహిళా పైలట్ల కారణంగా మరోసారి అందరి నోళ్లలో నానుతోంది. కికి ఛాలెంజ్ ప్రమాదకరమైనది కావడంతో చాలాచోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మన దేశంలో పలు రాష్ట్రాల్లో పోలీసులు దీనిపై హెచ్చరికలు జారీ చేశారు కూడా.

ఇద్దరు మహిళా పైలట్ల కికి చాలెంజ్

ఇద్దరు మహిళా పైలట్ల కికి చాలెంజ్

తాజాగా, మహిళా పైలట్ల కికి ఛాలెంజ్ వైరల్ అయింది. ఇప్పటి వరకు కదులుతున్న కార్లతో చేసిన కికి ఛాలెంజ్ చూశాం. ఇప్పుడు మెక్సికోకు చెందిన ఇద్దరు మహిళా పైలట్లు ఏకంగా కదులుతున్న విమానంతో కికి ఛాలెంజ్ చేశారు.

ల్యాండ్ చేస్తూ కికి ఛాలెంజ్

అలెగ్జాండ్రా అట్లాంటిక్‌ మహాసముద్రంగా మీదుగా వెళ్లే ప్రయివేటు సంస్థకు చెందిన విమానాల పైలట్లు. ఇప్పటి వరకు ఆమె నలభై దేశాలను చుట్టి వచ్చారు. వారం క్రితం అలెగ్జాండ్రా తన అసిస్టెంట్‌ పైలట్‌తో కలిసి విమానాన్ని ల్యాండ్‌ చేస్తూ ఒక్కసారిగా కికి ఛాలెంజ్‌ డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారు.

అప్పటికి విమానం పూర్తిగా ఆగలేదు

అప్పటికి విమానం పూర్తిగా ఆగలేదు


వారు కికి ఛాలెంజ్ విసిరే సమయానికి విమానం పూర్తిగా ఆగలేదు. కాక్‌పిట్‌‌ తలుపును తెరిచి విమానాన్ని పట్టుకుని డ్యాన్సులు చేశారు. అనంతరం అదే విమానంలోకి వెళ్లారు.

సాధించానని పైలట్

సాధించానని పైలట్

తనకు చిన్నప్పటి నుంచి భిన్నంగా చేయాలని ఇష్టమని, తమది మధ్యతరగతి కుటుంబమని, డబ్బులు లేక తాను విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోయానని, పద్దెనిమిదేళ్ల వయసులో ఓ ప్రయివేటు సంస్థకు చెందిన ఎయిర్ లైన్స్‌లో కస్టమర్‌ కేర్‌లో ఉద్యోగంలో చేరానని, నాటి నుంచి తనకు విమానాల పట్ల ఇష్టం కలిగిందని, ఎలాగైనా పైలట్‌ అవ్వాలని అనుకున్నానని, చివరకు సాధిచానని అలెగ్జాండ్రా వెల్లడించారు.

English summary
Pilot Alejandra Manriquez was joined by a flight attendant onboard when she took part in the challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X