వైరల్ వీడియో : గుండె ధైర్యం ఉంటేనే చూడండి
అమెరికా : సాహసమే శ్వాసగా బ్రతికేవాళ్లుంటారు కొందరు. ప్రాణాలకు తెగించయినా సాహసం చేయడం ఒక్కటే వాళ్ల టార్గెట్. ఆ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులకు వాళ్లు బెదిరిపోరు. గుండె ధైర్యం కూడగట్టుకుని సాహసాలకు సిద్దమయిపోతారు. అయితే అలాంటి సాహసాలను వీక్షించడానికి కూడా.. కాస్త గట్టి గుండె ఉన్నవాళ్లయితేనే పూర్తిగా తిలకించగలరు. లేకపోతే మధ్యలోనే కళ్లు తిరిగి గుండె బేజారవడం ఖాయం.
ఇదే తరహాలో ఇప్పుడు యూట్యూబ్ లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. బిలిర్డ్ చిన్ అనే ఫేస్ బుక్ పేజీ ద్వారా ఈ నెల 9వ తేదీన అప్ లోడ్ అయిన ఈ వీడియోను చూడాలంటే.. ఖచ్చితంగా గుండె ధైర్యం ఉండాల్సిందే. ఆ సాహసం చేసిన వ్యక్తి ఎవరో తెలియదు గానీ..! ఏకంగా వందల అడుగుల ఎత్తులో ఉన్న ఓ బిల్డింగ్ చివరన నిలబడి ఓ చిన్నపాటి పాదయాత్రనే చేసేశాడు.
నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు చూస్తేనే 'వామ్మో' అనుకునేవాళ్లకు.. ఇలాంటి వీడియోలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తాయనడంలో అతిశయోక్తి లేదేమో!. ఈ వీడియోను ఇప్పటికే 70లక్షల మంది చూడడం విశేషం. అంటే.. వాళ్లంతా గుండె ధైర్యం ఉన్నవాళ్లే అన్నమాట.












Click it and Unblock the Notifications