వైరల్ వీడియో:'మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది': జైషే మహ్మద్ కమాండర్ సంచలన ప్రకటన

Viral Video: జైషే మహ్మద్ అగ్ర కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒక వీడియోలో సంచలన విషయం వెల్లడించారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ వల్ల మౌలానా మసూద్ అజార్ కుటుంబం తీవ్రంగా ప్రభావితమైందని ఆయన అంగీకరించారు. పహల్గాం దాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత మే 7న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్‌లో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాలు, వాయు మౌలిక సదుపాయాలను భారత్ ధ్వంసం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో క్లిప్‌లో మసూద్ ఇలియాస్ కాశ్మీరీ మాట్లాడుతూ.. "ఈ భూమిని రక్షించుకోవడానికి, మేము సైనిక చర్యలకు దిగి ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లలో పోరాడాం. మే 7న భారత దళాలు బహవల్పూర్‌లో దాడి చేసి మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి" అని అన్నాడు. ఈ వీడియోలో మసూద్ ఇలియాస్ గట్టిగా మైక్రోఫోన్‌లో మాట్లాడుతుండగా.. అతని వెనుక తుపాకులు పట్టుకున్న పలువురు గార్డులు నిలబడి ఉన్నారు.

Viral Video Masood Azhar s Family Torn Apart JeM Commander s Shocking Admission on Operation Sindoor

బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం
పంజాబ్ ప్రావిన్స్‌లోని ఎన్‌హెచ్-5 (కరాచీ-టోర్ఖమ్ హైవే)లో ఉన్న మార్కజ్ సుభాన్‌అల్లా జైషే మహ్మద్‌కు ఆపరేషనల్ ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. 2019 పుల్వామా దాడితో సహా డజనుకు పైగా ప్రధాన ఉగ్రవాద దాడులకు ఇక్కడే ప్రణాళికలు రూపొందించారు. పుల్వామా దాడి చేసిన ఉగ్రవాదులకు ఇక్కడే శిక్షణ ఇచ్చారు. ఈ స్థావరంలో 600 మందికి పైగా సభ్యులు ఉన్నారని, జైషే మహ్మద్ సభ్యులకు తరచుగా శిక్షణా తరగతులు నిర్వహించేవారని తెలిసింది.

ఆపరేషన్ సిందూర్ ఎందుకు?
ఇలియాస్ వ్యాఖ్యలు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మే 7న ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్‌ను సూచిస్తున్నాయి. ఈ దాడి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో లష్కర్-ఎ-తైబా బృందం బైసరన్ వ్యాలీలోని పర్యాటకులపై భయంకరమైన దాడి చేసి 26 మంది పౌరులను చంపింది. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రదాడులలో ఇది ఒకటి. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ప్రధాన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కర్-ఎ-తైబా ప్రధాన కార్యాలయం సహా పలు కీలక స్థావరాలు ఉన్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ కేంద్రాలన్నీ భారత సాయుధ దళాల దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో ప్రతిస్పందించింది. అయితే, వీటిని ఇండియా వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. దీంతో భారత్ వైపు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ మరియు రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో సహా కీలకమైన వైమానిక స్థావరాలపై మరింత కచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడులు పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రతీకార చర్యల రెండో దశను సూచిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+