Viral Video : కనీ వినీ ఎరుగని వింత జీవి.. ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్న నెటిజెన్స్..
సోషల్ మీడియాలో ఓ వింత జీవి వీడియో వైరల్‌గా మారింది. నల్లగా.. శరీరమంతా వానపాములు పాకుతున్నట్టుగా ఉన్న ఆ జీవి ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమీబా ఆకారంలో.. ఓ రాయి మీద పాకుతున్న దాని వీడియోను ఎవరో తమ సెల్ ఫోన్‌లో బంధించి గత వారం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అప్పటినుంచి ఈ వింత జీవి పేరేంటో కనుక్కొనేందుకు నెటిజెన్స్ ఆపసోపాలు పడుతున్నారు. కొంతమంది నెటిజెన్స్ దీన్ని స్పైడర్ మ్యాన్-3,వెనోమ్ సినిమాల్లో కనిపించిన ఏలియన్ సింబియోట్‌తో పోలుస్తున్నారు. వెనోమ్ నిజంగానే భూమి పైకి వచ్చిందేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి ఈ వింత జీవుల బెడద ఏంటి బాబోయ్ అని కొందరు నెటిజెన్స్ వాపోతున్నారు. మరికొందరైతే వెనోమ్ 2 ఫిలింకు పబ్లిసిటీ తీసుకొచ్చేందుకు సోనీ పిక్చర్స్ సంస్థనే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఇలా చేస్తుందోమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియా బెరింగ్ రెషియో(సీబీఆర్) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

దీన్ని బూట్‌లేస్ సరీసృపంగా పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది అత్యంత పొడవైన జీవి అని.. దాదాపు 180మీ. పొడవు ఉంటుందని తెలిపారు. అది తన శరీరం ద్వారా విషపూరిత ద్రవాన్ని విడుదల చేస్తుందని తెలిపారు. వీటి శరీరం జెల్లీలా కదులుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 19.5మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
Recommended Video
Anybody know what this is? pic.twitter.com/B2dQLTm4td
— stimulus package (@sunnyarkade) April 2, 2020












Click it and Unblock the Notifications