వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:ఈ పెంపుడు కుక్క చేసే పనిచూస్తే వావ్ అనాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

విశ్వాసంకు మారు పేరు కుక్క అని అంటుంటాం. కుక్కలను చాలామంది పెంచుకుంటుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కుక్కను తమ ఇళ్లల్లో పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. ఇక కుక్కలు ఇంటిపనిలో కూడా సహాయపడుతుంటాయి. ఇక ఇంట్లో దొంగలు పడకుండా కూడా కాపలా కాస్తుంటాయి. కుక్కకు ఒక ముద్ద అన్నం పెడితే చాలు అది బతికున్నంత కాలం అన్నం పెట్టిన వ్యక్తిని గుర్తుంచుకుని విశ్వాసంతో మెలుగుతుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందలో ఓ శునకం చేసే పని చూస్తే వావ్ అనాల్సిందే..!

లాండ్రీ చేస్తూ ఆశ్చర్య పరిచిన కుక్క

కొద్ది రోజుల క్రితం ఓ యజమానురాలు మరో కుక్క కలిసి యోగా చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసేసింది. ఇప్పుడు మళ్లీ వీళ్లే వార్తల్లో నిలిచారు. వీడియోలో కనిపించే కుక్క పేరు సీక్రెట్.. ఇక తన యజమానిరాలు పేరు మేరీ. ఆస్ట్రేలియన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క సీక్రెట్. ఇక ఈ శునకం చేసే పనులు చూస్తే అబ్బురపడాల్సిందే. బట్టలు ఉతకడంలో సీక్రెట్ అనే ఈ కుక్క మేరీకి సహాయం చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం బట్టలు ఉతకడంలోనే ఈ శునకం సహాయం చేయలేదు... బట్టలు ఆరిన తర్వాత వాటిని ర్యాక్‌లో పెట్టడంలో కూడా సహాయం చేస్తోంది. ఇక ఈ వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగానే 51,712 లైకులు వచ్చాయి. మేరీ అండ్ సీక్రెట్ పేరు మీద ప్రత్యేకంగా ఇన్స్‌టాగ్రామ్ ఖాతా ఉంది. దీనికి ఎంతలేదన్నా 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

యోగాసనాలు వేసిన సీక్రెట్

ఇక కొద్దిరోజుల క్రితం మేరీ మరియు సీక్రెట్‌లు కలిసి యోగా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఎంచక్కా యోగా మ్యాట్‌ను పరుచుకుని ఆ తర్వాత మేరీ యోగా చేస్తుంటే ఆమెను చూసి ఈ శునకం చేయడం చూస్తే ఔరా అనిపిస్తుంది. మేరీ వేసే ఆసనాలను ఈ శునకం కూడా వేసి అబ్బురపరుస్తోంది.

గిటార్ వాయిస్తూ వావ్ అనిపిస్తున్న కుక్క

ఇక మరో వీడియోలో గిటార్ వాయిస్తూ, పెయింటింగ్ వేస్తూ మేరీని ఉయ్యాల ఊపుతూ ఇలా ఒక్కటేమిటి అన్ని పనులు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది ఈ సీక్రెట్ అనే ఆస్ట్రేలియన్ షెపర్డ్.

English summary
Video of a pet dog performing various tasks has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X